డైరెక్టర్ పరశురాం అడ్వాన్స్ అప్పులకు దిల్ రాజు హామీ ఇచ్చాడట?
టాలీవుడ్ డైరెక్టర్ పరశురాంకు ఇండస్ట్రీలో గడ్డుకాలం నడుస్తోంది. ఇండస్ట్రీలో ప్రస్తుతం క్లిష్ట పరిస్థితి ఎదుర్కొంటున్నారు. ‘సర్కారు వారి పాట’ చిత్రం తర్వాత ఆయన మరో చిత్రానికి సైన్ చేయలేదు. అనివార్య కారణాల వల్ల డిలే అవుతుండగా.. నిర్మాతల వద్ద తీసుకున్న అడ్వాన్సులు తడిసి మోపెడయ్యాయి. ఇప్పుడు విజయ్ దేవరకొండతో సినిమా ఓకే అయినా.. బకాయిలు చెల్లిస్తే గానీ ముందుకెళ్లేలా లేదు. దీంతో దిల్ రాజురంగంలోకి దిగినట్లు తెలుస్తోంది. స్టార్ హీరోలతో సినిమాలు మెటీరియలైజ్ అవడం లేదు. నిర్మాతల దగ్గర తీసుకున్న అడ్వాన్స్‌లు పేరుకుపోతున్నాయి.
ఈ నేపథ్యంలోనే ప్రముఖ ప్రొడక్షన్ హౌస్‌కు కోట్ల రూపాయలు బకాయిపడ్డట్లు నెట్టింట రూమర్స్ హల్ చల్ చేస్తున్నాయి. ఇంతలోనే విజయ్ దేవరకొండకు కథ చెప్పి ఒప్పించాడు పరశురాం. దీంతో ‘గీతా గోవిందం’ కాంబినేషన్ రిపీట్ కానుండగా.. ఈ మూవీని దిల్ రాజు బ్యానర్లో చేసేందుకు సైన్ చేశాడు. కానీ గీతా ఆర్ట్స్ అంతకుముందే తనకు అడ్వాన్స్ ఇచ్చి ఉండటంతో ఇది వివాదంగా మారింది. కానీ ప్రస్తుతం విజయ్ దేవరకొండతో దిల్ రాజు ప్రొడక్షన్స్‌లో ప్రాజెక్ట్ సెట్ చేసుకున్నాడు పరశురాం. దీనిపై గీతా ఆర్ట్స్ అధినేత అల్లు అరవింద్ కోపంగా ఉన్నారు. రీసెంట్ ప్రెస్ మీట్లో ఆయన పరశురాం పేరెత్తకుండా విమర్శలు చేశాడు.
ఈ సందర్భంగా మరో దర్శకుడు చందూ మొండేటి కమిట్మెంట్ను మెచ్చుకుంటూ.. ఇతను వేరొక దర్శకుడిలా నన్ను మోసం చేయలేదని పరోక్షంగా పరశురాంపై కామెంట్ చేశాడు. ఇదిలా ఉంటే, 14 రీల్స్ (14 Reels) నిర్మాతలు కూడా పరశురాంపై అసంతృప్తితో ఉన్నారని తెలుస్తుండగా.. దీనికి కూడా విజయ్ దేవరకొండతో సినిమానే కారణమనే న్యూస్ హల్ చల్ చేస్తోంది. విషయానికొస్తే.. 14 రీల్స్ ప్రొడక్షన్ హౌస్‌లో నాగ చైతన్య, పరశురాం కాంబినేషన్లో ఓ సినిమా చేయాల్సింది. కానీ మహేష్ బాబు నుంచి పిలుపు రావడంతో అక్కినేని హీరో సినిమాను వదులుకున్నాడు పరశురాం. ఆ తర్వాత కూడా చైతన్యతో చేయాల్సి ఉన్నా స్టోరీ వర్కవుట్ కాలేదు. దీంతో పరశురాం కోలీవుడ్ కార్తీకి ఒక స్క్రిప్ట్ వినిపించి ఓకే చేయించుకున్నాడు. ఈ ప్రాజెక్ట్‌ను 14 రీల్స్ నిర్మించాల్సి ఉంది. కానీ ప్రస్తుత కమిట్మెంట్స్ పూర్తయ్యాక నవంబర్ లేదా జనవరిలో చేస్తానని హామీ ఇచ్చాడట కార్తీ.
అయితే, ఈ గ్యాప్‌లోనే రూట్ మార్చేసిన పరశురాం.. కార్తీ సినిమా కంటే ముందు విజయ్ దేవరకొండతో దిల్ రాజు ప్రొడక్షన్లో ప్రాజెక్ట్ సెట్ చేసుకుకుని 14 రీల్స్‌కు హ్యాండ్ ఇచ్చాడని తెలుస్తోంది. పరశురాం ప్రస్తుతం విజయ్ సినిమాపైనే ఫోకస్ చేయడంతో కార్తీ సైతం లైట్ తీసుకుని వేరే ప్రాజెక్ట్ కోసం ట్రై చేస్తున్నాడని 14 రీల్స్ నిర్మాతలు వాదిస్తున్నారట. ఎందుకంటే తమకు రెండు ప్రాజెక్ట్‌లు చేజారిపోయాయి. ఇండస్ట్రీ వర్గాల సమాచారం ప్రకారం.. ఆ రెండు ప్రాజెక్ట్‌లకు సంబంధించి పరశురాం తమకు రూ. 13 కోట్లు (వడ్డీతో సహా) బకాయి పడ్డట్లు రూమర్స్ వినిపిస్తున్నాయి. ఈ మేరకు పరశురాంతో సెటిల్మెంట్ లేదా దిల్ రాజు ప్రొడక్షన్లో విజయ్ దేవరకొండతో చేస్తున్న సినిమాలో పార్ట్నర్షిప్ కోసం చూస్తున్నారట 14 రీల్స్ నిర్మాతలు. తమ సమస్యను పరిష్కరించకపోతే ఆ ప్రాజెక్ట్‌ను అడ్డుకోవాలని డిసైడ్ అయ్యారట. అయితే, దిల్ రాజు మాత్రం ఇవేమీ పట్టించుకోకుండా ప్రాజెక్ట్ పనులు కొనసాగిస్తున్నారని సన్నిహిత వర్గాలు వెల్లడిస్తున్నాయి.
ఇదిలా ఉంటే, రీసెంట్గా ‘కస్టడీ’ మూవీ ప్రమోషన్స్‌లో పాల్గొన్న నాగ చైతన్య.. పరశురాం గురించి ప్రస్తావన వస్తే అతని గురించి మాట్లాడుకోవడం వేస్ట్ అని ఓపెన్‌గా కామెంట్ చేశాడు. అతను తన టైమ్ వేస్ట్ చేశాడని అసహనం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. అయితే, పరశురాం బాకీలను చెల్లించనున్న దిల్ రాజు.. తర్వాత అతని రెమ్యూనరేషన్లో కట్ చేసుకుంటారని టాక్. ఇక ఫ్యామిలీ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న ఈ మూవీ షూటింగ్‌ను క్విక్ షెడ్యూల్లో పూర్తి చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఇందులో హీరోయిన్గా ఎవరు నటించనున్నారు? కాస్ట్ అండ్ క్రూ తదితర వివరాలను త్వరలోనే ప్రకటించనున్నారు. ప్రస్తుతం విజయ్ దేవరకొండ.. తను హీరోగా మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ‘ఖుషి’ చిత్ర షూటింగ్లో పాల్గొంటున్నాడు. ఇది పూర్తవగానే పరశురాం సినినమాను మొదలు పెట్టనున్నాడు.













