రిలీజ్ విషయంలో పట్టుదలతో దిల్ రాజు
గేమ్ ఛేంజర్(Game Changer) సినిమా కోసం మెగా ఫ్యాన్స్ గత మూడేళ్లుగా ఎదురుచూస్తున్నారు. అయినా ఇప్పటికీ ఈ సినిమా రిలీజ్ డేట్ విషయంలో ఇంకా క్లారిటీ రాలేదు. ముందు డిసెంబర్ 20 అన్నారు. కానీ డిస్ట్రిబ్యూటర్లు చెప్తున్న దాన్ని బట్టి డిసెంబర్ 25 అంటున్నారు. జస్ట్ 15 రోజుల గ్యాప్ తో విశ్వంభర(Viswambhara)తో పాటూ మిగిలిన సినిమాలు కూడా రిలీజ్ కానుండటంతో ఇంకాస్త ముందు గేమ్ ఛేంజర్ ను రిలీజ్ చేస్తే మంచి కలెక్షన్స్ సాధించొచ్చని ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు.
అయితే శంకర్(Shankar) ఇప్పటికీ గేమ్ ఛేంజర్ ఫైనల్ కాపీని రెడీ చేసి ఇస్తాడనేది క్లారిటీ లేదు. అసలు తీరికే లేకుండా శంకర్ గేమ్ ఛేంజర్ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ లో బిజీగా ఉంటూ సినిమాను పూర్తి చేస్తున్నట్లు టాక్. కొన్నాళ్ల కిందట విశ్వంభర పోస్ట్ పోన్ అవొచ్చని, ఆ ప్లేస్ లో గేమ్ ఛేంజర్ ఉంటుందని నెట్టింట వార్తలొచ్చాయి.కానీ నిర్మాత దిల్ రాజు మాత్రం సినిమాను క్రిస్మస్కే రిలీజ్ చేయాలని చాలా పట్టుదలతో ఉన్నాడట.
ఆ ఉద్దేశంతోనే మొన్న రా మచ్చా సాంగ్(Raa Macha Song) లాంచ్ లో నొక్కి మరీ డిసెంబర్ రిలీజ్ అని చెప్పారు. శంకర్ చెప్పకపోయినా దిల్ రాజు మాత్రం తన ఒపీనియన్ ను ఆ విధంగా బయటపెట్టాడు. అంతేకాదు ఇకపై గేమ్ ఛేంజర్ ప్రమోషన్స్ నాన్‌స్టాప్ గా ఉంటాయని చెప్పడంతో ఫ్యాన్స్ కూడా బాగా ఎక్స్పెక్టేషన్స్ పెట్టేసుకున్నారు. దసరాకు గేమ్ ఛేంజర్ టీజర్(Game Changer Teaser)ను రిలీజ్ చేసే ప్లాన్ లో ఉన్న మేకర్స్ ప్రస్తుతం దాన్ని ఎడిటింగ్ చేయిస్తున్నట్లు సమాచారం. మొత్తానికి దిల్ రాజు మాత్రం గేమ్ ఛేంజర్ రిలీజ్ డేట్ విషయంలో చాలా పట్టుదలతో ఉన్నట్లు అర్థమవుతుంది.













