గేమ్ ఛేంజర్ రిలీజ్పై దిల్ రాజు క్లారిటీ
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా శంకర్ దర్శకత్వంలో వస్తోన్న గేమ్ ఛేంజర్ మూవీ కోసం ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్నారు. అన్నీ అనుకున్నవి అనుకున్నట్లు జరిగితే ఈ సినిమా ఇప్పటికే పూర్తయి రిలీజ్ కావాల్సింది. కానీ శంకర్ ఆగిపోయిన తన పాత సినిమా ఇండియాన్2ను మళ్లీ రీస్టార్ట్ చేయడంతో గేమ్ ఛేంజర్ వాయిదా పడుతూ వచ్చింది.
ఎప్పటికప్పుడే ఇదిగో అదిగో అంటున్నారు తప్పించి గేమ్ ఛేంజర్ రిలీజ్ విషయంలో మాత్రం ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. ఈ విషయంలో రీసెంట్ గా దిల్ రాజు ఓ క్లారిటీ ఇచ్చాడు. ఓ మాస్ థియేటర్లో ఫ్యాన్స్ తో పాటూ సలార్ మూవీ చూసిన దిల్ రాజును మీడియా వారు గేమ్ ఛేంజర్ రిలీజ్ ఎప్పుడని అడగ్గా, వెంటనే 2024 సెప్టెంబర్ లో రిలీజ్ కానుందని క్లారిటీ ఇచ్చాడు.
అంటే గేమ్ ఛేంజర్ కోసం చరణ్ ఫ్యాన్స్ మరో ఆరు నెలలు ఆగక తప్పదన్నమాట. ఇంకా ఈ సినిమాకు సంబంధించిన కొంత షూటింగ్ పెండింగ్ ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నెలాఖరుకి మరో ఓ మూడు రోజుల షెడ్యూల్ ను పూర్తి చేయబోతున్నారు. ఆ తర్వాత న్యూ ఇయర్ బ్రేక్ తీసుకుని కొత్త షెడ్యూల్ ను స్టార్ట్ చేయబోతున్నారు. ఈ సినిమా పూర్తి కాగానే చరణ్, బుచ్చిబాబు సానతో కలిసి సెట్స్ పైకి వెళ్లనున్నాడు.













