Game Changer: గుడ్ న్యూస్ చెప్పిన దిల్ రాజు
గేమ్ ఛేంజర్(game changer) నిర్మాత దిల్ రాజు(dil raju) మెగా ఫ్యాన్స్ కు మంచి కిక్కిచ్చే న్యూస్ చెప్పాడు. గేమ్ ఛేంజర్ సినిమాకు ఎలాంటి ఆటంకాలు లేకుండా రెండు తెలుగు రాష్ట్రాల్లో పక్కా ప్లానింగ్ తో ప్రీమియర్లు ఉంటాయని ఆయన స్పష్టం చేశాడు. పుష్ప2(pushpa2) బెనిఫిట్ షో సందర్భంగా సంధ్య థియేటర్(sandhya theatre) దగ్గర జరిగిన దుర్ఘటన వల్ల ఇకపై స్పెషల్ షోలు ఉండవని అందరూ టెన్షన్ పడుతున్న టైమ్ లో దిల్ రాజు చెప్పిన మాటలు అందరికీ ఊరటనిస్తున్నాయి.
దిల్ రాజు చెప్పిన మాటలు చూస్తుంటే గేమ్ ఛేంజర్ తో పాటూ డాకు మహారాజ్(daku maharaj), సంక్రాంతికి వస్తున్నాం(sankranthiki vasthunnam) సినిమాలకు కూడా ప్రీమియర్లు ఉండే ఛాన్సుంది. అక్కడుంది దిల్ రాజు కాబట్టి అన్నీ పక్కాగా ప్లాన్ చేసుకుంటాడు. పండక్కి వస్తున్న మూడు సినిమాల్లో రెండు ఆయన సొంత బ్యానర్ నుంచి వస్తుండటం, మూడో సినిమాకు డిస్ట్రిబ్యూటర్ అవడం వల్ల ఈ పండక్కి రాజు గారు చాలా బిజీగా ఉండబోతున్నాడు.
డిస్ట్రిబ్యూషన్ వ్యవహారాలతో పాటూ స్క్రీన్ల సర్దుబాటు కూడా చూసుకోవాలి. ఈ ఏడాది సంక్రాంతిని మిస్ అయిన దిల్ రాజు ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనూ సంక్రాంతి సీజన్ ను మిస్ కాకూడదని డిసైడ్ అయినట్లు తెలుస్తోంది. మొత్తానికి గేమ్ ఛేంజర్ ప్రీమియర్ల విషయంలో దిల్ రాజు క్లారిటీ ఇచ్చాడు కాబట్టి ఇక మెగా ఫ్యాన్స్ సంబరాలకు సిద్ధమవొచ్చు. శంకర్(Shankar) దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా జనవరి 10న ప్రేక్షకుల ముందుకు రానుంది.













