ఇంద్రగంటిపై దిల్ రాజుకు ఎందుకంత నమ్మకం?
కొంతమందికి ఫ్లాపులు కూడా కొత్త ఛాన్సులను తెచ్చి పెడతాయి. ఇంద్రగంటి మోహనకృష్ణను చూస్తే ఇదే అనిపిస్తుంది. ఇంద్రగంటి గత సినిమా ఈ అమ్మాయి గురించి మీకు చెప్పాలి డిజాస్టర్. ఈ సినిమాపై సుధీర్ బాబు ఎంతో నమ్మకం పెట్టుకున్నాడు. కానీ రిజల్ట్ చూసిన సుధీర్ కు నిరాశే తప్పింది. దీనికి ముందు ఇంద్రగంటి చేసిన సినిమా వి.
నాని నెగిటివ్ రోల్ లో చేసిన ఈ సినిమా దారుణమైన ఫెయిల్యూర్ని చవిచూసింది. కరోనా కారణంగా డైరెక్ట్ గా ఓటీటీ రిలీజ్ కాబట్టి సేఫ్ అయింది కానీ థియేటర్ రిలీజ్ అయుంటే మాత్రం సిట్యుయేషన్ వేరేలా ఉండేది. రెండు సినిమాలు వరుసగా డిజాస్టర్లయినా సరే దిల్ రాజు కు ఇంద్రగంటిపై ఇంకా నమ్మకం అంతే ఉంది.
అందుకే పాన్ ఇండియా ప్రాజెక్ట్ జటాయువుకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని తెలుస్తోంది. విజయ్ దేవరకొండ కూడా ఈ సినిమా కథ విన్నాక సానుకూలంగా స్పందించాడని టాక్. ప్రస్తుతం దిల్ రాజు బ్యానర్లో పరశురామ్ తో సినిమా చేస్తున్న రౌడీ హీరోకు ఈ స్టోరీ బాగా నచ్చడం, దానికి తోడు బడ్జెట్ పరిమితులు కూడా లేకపోవడంతో వెంటనే ఓకే చెప్పినట్లు సమాచారం.
మరి దిల్ రాజు ఇచ్చిన ఇంతటి గొప్ప అవకాశాన్ని ఇంద్రగంటి ఎలా యూజ్ చేసుకుంటాడో చూడాలి. ప్రస్తుతం జటాయువుకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్, స్క్రిప్ట్ వర్క్స్ జరుగుతున్నాయి. శాకుంతలం సినిమా గ్రాఫిక్స్ విషయంలో జరిగిన తప్పు రిపీట్ కాకుండా మంచి గ్రాఫిక్స్ టీమ్ ని తీసుకోమని దిల్ రాజు ఇప్పటికే ఇంద్రగంటికి చెప్పాడట. జటాయువు సెట్స్ పైకి వెళ్లాలంటే వచ్చే ఏడాది వరకు ఆగాల్సిందే.













