వకీల్ సాబ్ దర్శక నిర్మాతలకు మెగా ఆఫర్..?
ఏదైనా సరే టాలీవుడ్ లో రికార్డ్స్ క్రియేట్ చేసే టాప్ స్టార్ హీరో కంబ్యాక్ సినిమాకు డైరక్షన్ చేసి ప్రశంసలందుకున్న డైరక్టర్ కి.. అలాగే రీమేక్ స్టోరీనే అయినా సినిమాను బంపర్ హిట్ చేసేంత గొప్ప టెక్నికల్, ప్రొడక్షన్ వాల్యూస్ తో సినిమా తీసినందుకు సదరు నిర్మాతను.. మెగాస్టార్ తన ఇంటికి పిలిచి మరీ ప్రశంసించి, తర్వాత తనతో ఒక సినిమా చేయాలని కోరినట్లు తెలుస్తుంది.
ఇప్పటికే వకీల్ సాబ్ కు పాజిటివ్ టాక్ రావడం, దానికి తోడు ఇండస్ట్రీకి పెద్ద దిక్కుగా ఉన్న మెగాస్టార్ తమను పిలిచి అలా మాట్లాడటంతో ఆ దర్శక నిర్మాతలిద్దరూ తబ్బిబ్బవుతున్నారు. అంతేకాదు మెగాస్టార్ హోమ్ బ్యానర్ కొణిదెల ప్రొడక్షన్ కంపెనీతో టై అప్ అయి ఆ నిర్మాత, దర్శకుడితో మరో సినిమాను నిర్మించే అవకాశమూ లేకపోలేదనే వార్త ఇప్పుడు ఇండస్ట్రీలో వినిపిస్తుంది.
ఒక సినిమాకు పాజిటివ్ టాక్ రావడం ఆలస్యం. ఆ ఎనర్జీనే వేరు. త్వరత్వరగా ఛాన్సులొస్తాయి. ఎవరూ ఊహించని ఆఫర్లు కూడా అందుకుంటారు. ఇప్పుడు ఆ ఎనర్జీ వేణు శ్రీరామ్ లో చాలా బాగా కనిపిస్తుంది. పవన్ కు హిట్ ఇస్తే, మెగాస్టార్ తో ఆఫర్ ఖాయమే అనే టాక్ రీసెంట్ గా వచ్చినప్పటికీ, ఇప్పుడు ఏకంగా మెగాస్టార్ ఏకంగా ఇంటికి పిలిచి అభినందించడంతో ఈ కాంబినేషన్ కు జాక్ పాట్ తగిలినట్టేనన్న టాక్ వినిపిస్తుంది. మరి వేణు శ్రీ రామ్, మెగాస్టార్ , దిల్ రాజు కాంబినేషన్ లో సినిమా ఉంటుందో లేదో తెలియాలంటే మరికొన్నాళ్లు ఆగాల్సిందే.













