సంక్రాంతికి డ్రాప్ అయితే తర్వాత సోలో రిలీజ్
టాలీవుడ్ లో ఇప్పుడెక్కడ చూసిన సంక్రాంతి సినిమాల గురించే చర్చ. ఈ సీజన్లో 5 క్రేజీ తెలుగు సినిమాలు రిలీజ్ కానుండటం ఓపెనింగ్స్ పై ఎలాంటి ఎఫెక్ట్ చూపిస్తుందోనని ఫ్యాన్స్ టెన్షన్ పడుతున్నారు. ఈ నేపథ్యంలోనే ప్రొడ్యూసర్స్ సమాఖ్య ప్రమేయాన్ని ఫ్యాన్స్ కోరుకున్నారు. ఓ విడత మీటింగ్ కూడా జరిగింది.
అయితే రీసెంట్ గా దిల్ రాజు ఆ మీటింగ్ లో తీసుకున్న నిర్ణయాన్ని చెప్పాడు. ఎవరైనా సరే సంక్రాంతి పోటీ నుంచి తప్పుకుంటే వాళ్లు తర్వాత ఏ డేట్ కోరుకుంటారో ఆ డేట్లో పోటీ రాకుండా సోలో రిలీజ్ దక్కేలా ప్రొడ్యూసర్ కౌన్సిల్ బాధ్యత తీసుకుంటుందని చెప్పాడు. ఈ ఆఫర్ బాగున్నప్పటికీ సంక్రాంతి రేసు నుంచి తప్పుకోవడానికి ఎవరూ రెడీగా కనిపించడం లేదు.
గుంటూరు కారం ఎట్టి పరిస్థితుల్లో జనవరి 12కు వస్తోంది. అదే రోజున హను మాన్ కూడా రిలీజ్ అవుతుందని నిర్మాతలు గట్టిగా చెప్తున్నారు. ఈగల్, సైంధవ్ జనవరి 13న రానున్నాయి. నా సామిరంగ జనవరి 14న రిలీజ్ అని అతి త్వరలోనే అనౌన్స్మెంట్ రానుంది. ఈ డేట్స్ నుంచి ఎవరూ తమ సినిమాను పోస్ట్ పోన్ చేసుకోవడానికి రెడీగా లేరు. ఆఫర్ మంచిదైనా ఈ ఆఫర్ ను వాడుకునే వాళ్లు మాత్రం కనిపించడం లేదు.













