RC17: చరణ్ కోసం సుకుమార్ అప్పుడే పూర్తి చేసేశాడా?

ఆర్ఆర్ఆర్(RRR) తర్వాత రామ్ చరణ్(Ram Charan) ఎన్నో ఆశలు పెట్టుకుని శంకర్(Shankar) తో చేసిన గేమ్ ఛేంజర్(Game Changer) సినిమా భారీ డిజాస్టర్ గా నిలిచిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం రామ్ చరణ్ తన 16వ సినిమాను ఉప్పెన(Uppena) ఫేమ్ బుచ్చిబాబు సాన(Buchibabu Sana) దర్శకత్వంలో చేస్తున్నాడు. చరణ్, అతని ఫ్యాన్స్ ఈ సినిమాపై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. విలేజ్ బ్యాక్ డ్రాప్ స్పోర్ట్స్ డ్రామాగా రూపొందుతున్న ఈ సినిమాపై అందరికీ భారీ అంచనాలున్నాయి.
జాన్వీ కపూర్(Janhvi kapoor) హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాది మార్చి 27న రిలీజ్ కానుండగా, ఈ సినిమాను వీలైనంత త్వరగా పూర్తి చేసి నెక్ట్స్ సినిమాను మొదలుపెట్టాలని చూస్తున్నాడు చరణ్. అయితే చరణ్ తన తర్వాతి సినిమాను సుకుమార్(Sukumar) తో చేయనున్నారని ఇప్పటికే వార్తలొచ్చిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఈ సినిమా గురించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ తెలుస్తోంది.
ఆర్సీ17(RC17) కోసం గా రామ్ చరణ్, సుకుమార్ కాంబినేషన్ లాకైందని, ఇప్పటికే సుకుమార్ దానికి సంబంధించిన స్క్రిప్ట్ ను కూడా పూర్తి చేశారని, మంచి టైమ్ చూసుకుని త్వరలోనే సినిమాను అనౌన్స్ చేయనున్నారని తెలుస్తోంది. గతంలో సుకుమార్, రామ్ చరణ్ కాంబినేషన్ లో వచ్చిన రంగస్థలం (Rangasthalam) సినిమా మంచి టాక్ తో ఇండస్ట్రీ హిట్ గా నిలవగా, ఇప్పుడు ఆర్సీ17ను దాన్ని మించేలా తెరకెక్కించనున్నారట సుకుమార్.