Pawan Kalyan: ఆయన పాడాల్సిన పాటను పవన్ పాడాడా?
పవన్ కళ్యాణ్(Pawan Kalyan) నటించిన హరిహర వీరమల్లు(Harihara Veeramallu) నుంచి కొన్నాళ్ల కిందట మాట వినాలి(Maata Vinali) అనే ఫస్ట్ సాంగ్ రిలీజైన విషయం తెలిసిందే. పవన్ కళ్యాణ్ పాడిన ఈ పాట మ్యూజిక్ లవర్స్ ను ఎంతగానో ఆకట్టుకుంది. ఈ పాటను ప్రముఖ రచయిత పెంచల్ దాస్(Penchal Das) రాశాడు. ఆయన రాసిన సాహిత్యం ప్రతి ఒక్కరినీ ఆలోచింపచేసేదిలా ఉందని పాటకు మంచి ప్రశంసలు కూడా వచ్చాయి.
అయితే వీరమల్లులోని మాట వినాలి సాంగ్ ను నిజానికి ఆయనే పాడాల్సిందట. కానీ కొన్ని కారణాల వల్ల సడెన్ గా పవన్ కళ్యాణ్ ట్రాక్ లోకి వచ్చాడని రీసెంట్ గా ఓ ఈవెంట్ లో పెంచల్ దాస్ వెల్లడించాడు. అయితే సడెన్ గా ఈ పాటను పాడటానికి పవన్ ఎందుకు లైన్ లోకి వచ్చాడనేది మాత్రం పెంచల్ దాస్ కారణాలు చెప్పలేదు.
ఇక పెంచల్ దాస్ విషయానికొస్తే ఆయన ఇప్పటికే ఎన్నో సినిమాలకు జానపద పాటలు రాశాడు. కానీ ఆయన నాని(Nani) హీరోగా వచ్చిన కృష్ణార్జున యుద్ధం(Krishnarjuna Yuddham) సినిమాలో రాసిన దారి చూడు(Daari Choodu) సాంగ్, ఎన్టీఆర్(NTR) హీరోగా నటించిన అరవింద సమేత(Aravinda Sametha)లోని యాడ పోయినాడో(Yeda Poyinado) పాటలతో బాగా పాపులర్ అయ్యాడు. రీసెంట్ గా ఆయన విశ్వక్సేన్(Viswaksen) నటించిన లైలా(Laila) సినిమాలో ఓహో రత్తమ్మ(Oho Ratthamma) అనే సాంగ్ ను రాశాడు.













