శ్వాగ్ పై దేవర ఎఫెక్ట్?
గత వారం భారీ అంచనాల మధ్య రిలీజైన దేవర సినిమా ఫస్ట్ వీకెండ్ లో మంచి కలెక్షన్లను రాబట్టింది. సోమవారం వసూళ్లు డ్రాప్ బాగా ఉన్నప్పటికీ దసరా సెలవులు సినిమాకు కలిసొస్తాయని భావిస్తున్నారు. సెలవుల్లో ఎన్టీఆర్ లాంటి మాస్ హీరో సినిమా చూడ్డానికి ఆడియన్స్ బాగా ఇంట్రెస్ట్ చూపిస్తారు. కాబట్టి దసరా సెలవులయ్యే వరకు దేవరకు పోటీ పరంగా ఏ సినిమా లేదు.
కానీ రేపు శ్వాగ్ అనే మీడియం రేంజ్ మూవీ రిలీజ్ కానుంది. ఇప్పటికే రిలీజైన టీజర్, ట్రైలర్ ఆడియన్స్ ను బాగా ఆకట్టుకున్నాయి. టీమ్ కూడా సినిమాపై చాలా కాన్ఫిడెంట్ గా ఉంది. వారి నమ్మకం నిజమైతే మత్రం శ్వాగ్ శ్రీ విష్ణు కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్ అవడం ఖాయం. దీంతో శ్వాగ్ ఎఫెక్ట్ దేవరపై పడుతుందా లేక దేవర వల్ల శ్వాగ్ కు దెబ్బ పడుతుందా అనేది ఆసక్తికరంగా మారింది.
దేవరతో పాటూ రిలీజైన కార్తీ సత్యం సుందరంకు మంచి టాక్ వచ్చినప్పటికీ దేవర ఎఫెక్ట్ వల్ల సినిమా నష్టపోయింది. దేవర పోటీ లేకుండా ఉంటే సత్యం సుందరంకు మంచి కలెక్షన్స్ వచ్చి ఉండేవి. ఈ నేపథ్యంలో శ్వాగ్ ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొంటుందో చూడాలి. ఎలాగూ దేవర వచ్చి వారం దాటింది కాబట్టి రెగ్యులర్ ఆడియన్స్ కొత్త సినిమాను కోరుకుంటారు. ఎ సెంటర్స్ లో అయితే శ్వాగ్ కు ఎలాంటి ఇబ్బంది ఉండదు. కానీ మాస్ ఆడియన్స్ మాత్రం దేవర నుంచి ఇప్పుడప్పుడే బయటకొచ్చేలా లేరు. శ్వాగ్ అంచనాలను అందుకుని మంచి ఫలితం సాధిస్తే బానే ఉంటుంది కానీ లేదంటే దేవర వేటుకు బలవ్వడం ఖాయం.













