చిరూకు సెట్ కానిదే ఆ హీరో చేస్తున్నాడా?
అనిల్ రావిపూడి నుంచి ఇప్పటి వరకు వచ్చిన సినిమాలన్నీ బ్లాక్ బస్టర్లే. టాలీవుడ్ లో సక్సెస్ ఫుల్ డైరెక్టర్ గా కెరీర్ ను ముందుకు తీసుకెళ్తున్నాడు అనిల్. ఆయన నుంచి చివరిగా వచ్చిన భగవంత్ కేసరితో కూడా మంచి హిట్ అందుకున్న అనిల్, ఆ సినిమా సెట్స్ పై ఉన్నప్పుడే తన తర్వాతి సినిమా కోసం మెగాస్టార్ చిరూని కలిసి కథ చెప్పినట్లు వార్తలొచ్చాయి.
కానీ అనిల్ చెప్పిన కథ, తనకు సెట్ అవదేమోనన్న సందేహాన్ని చిరూ బయటపెట్టాడని టాక్ వచ్చింది. అయితే ఇప్పుడు అనిల్ రావిపూడి తర్వాతి సినిమాను విక్టరీ వెంకటేష్ తో చేయనున్నట్లు గత రెండ్రోజులుగా వార్తలొస్తున్నాయి. దిల్ రాజు బ్యానర్ లో రానున్న ఈ సినిమా కథ, చిరంజీవి కోసం అనిల్ రాసుకున్న కథేనని కొందరంటున్నారు.
కానీ చిరూ కోసం అనిల్ రాసుకున్న స్క్రిప్ట్ ను క్యాన్సిల్ చేయలేదని, ఆ స్టోరీని అలానే ఉంచి ఇప్పుడు వెంకీ కోసం మరో కొత్త కథను రెడీ చేశాడని చెప్తున్నారు. వెంకీ కోసం అనిల్ పక్కా విలేజ్ బ్యాక్ డ్రాప్ లో స్టోరీని సిద్ధం చేశాడని తెలుస్తోంది. ఇప్పటికే వెంకీ-అనిల్ కాంబోలో ఎఫ్-2, ఎఫ్-3 సినిమాలు వచ్చి అవి మంచి హిట్ అవడంతో ఇప్పుడు ఈ సినిమాపై ముందు నుంచే మంచి అంచనాలేర్పడ్డాయి.













