Brahmanandam: కమెడియన్గా బ్రహ్మానందం అంత సంపాదించాడా?
టాలీవుడ్ హాస్య బ్రహ్మగా పేరు తెచ్చుకున్న బ్రహ్మానందం(Brahmanandam) గురించి ఎవరికీ కొత్తగా పరిచయం చేయనక్కర్లేదు. తెలుగులోనే కాకుండా దేశమంతటా మొత్తం మీద స్టార్ హీరోలతో సమానం పాపులారిటీ అందుకున్న కమెడియన్ గా బ్రహ్మానందం పేరు తెచ్చుకున్నారు. దేశంలోనే ఖరీదైన కమెడియన్ గా బాగా క్రేజ్ తెచ్చుకున్నాడు బ్రహ్మీ(Brahmi).
1200కి పైగా సినిమాల్లో నటించిన బ్రహ్మానందం కామెడీ కింగ్ అనే బిరుదుని దక్కించుకున్నారు. అంతేకాదు ఎక్కువ సినిమాల్లో నటించిన కమెడియన్ గా బ్రహ్మీ గిన్నీస్ బుక్ లో స్థానం సంపాదించుకున్నాడు. ఆయన సినిమాలో నటించాలంటే రోజుకు రూ.1 లక్ష నుంచి రూ.4 లక్షల వరకు ఛార్జ్ చేస్తాడు.
అయితే సినిమాల ద్వారా సంపాదించిన ప్రతీ రూపాయినీ బ్రహ్మీ రియల్ ఎస్టేట్ లో పెట్టుబడిగా పెట్టి, దాన్ని వందల కోట్లకు పెంచుకున్నాడు. ప్రస్తుతం ఆయనకు రూ.800 కోట్లకు పైగా ఆస్తి ఉందని సమాచారం. కొంతమంది స్టార్ హీరోలకు కూడా ఇంత మొత్తంలో ఆస్తి ఉండదు కానీ కమెడియన్ గా బ్రహ్మానందం ఇంత భారీ సంపాదన చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు.













