Dia Mirza: నూడుల్స్ తిని పొట్ట నింపుకున్న హీరోయిన్
బాలీవుడ్ నటి దియా మీర్జా(Dia Mirza) మొదట మోడల్ గా కెరీర్ స్టార్ట్ చేసి ఆ తర్వాత సినిమాల్లోకి వచ్చింది. హీరోయిన్ గా పెద్దగా ఫేమ్ సంపాదించుకోలేకపోయినప్పటికీ సంఘ సేవ చేస్తూ ఎక్కువ గుర్తింపు అందుకుంది దియా మీర్జా. ఇదిలా ఉంటే రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న దియా మోడలింగ్ లోకి వచ్చిన కొత్తల్లో తాను పడిన ఇబ్బందుల్ని గుర్తి చేసుకుంది.
2000వ సంవత్సరంలో తాను, లారా దత్తా(Lara Dutta), ప్రియాంక చోప్రా(Priyanka Chopra) మిస్ ఇండియా కాంపిటిషన్లో పాల్గొన్నామని, ప్రియాంకకు ఫ్యామిలీ నుంచి పూర్తి సపోర్ట్ ఉండేదని, కానీ తనకు, లారా దత్తాకు మాత్రం కుటుంబ సభ్యుల సహకారం ఉండేది కాదని తెలిపింది. ఆ టైమ్ లో లారా ముంబైలో చిన్న రూమ్ లో రెంట్ కు ఉండేదని, ముంబై వచ్చినప్పుడు తాను కూడా అదే రూమ్ లో ఉండేదాన్నని దియా మీర్జా చెప్పుకొచ్చింది.
మోడలింగ్ కు వచ్చిన మొదట్లో డబ్బు లేక చాలా ఇబ్బంది పడ్డానని చెప్పిన ఆమె, ఫ్యాషన్ షో లో పార్టిసిపేట్ చేయడానికి ఖరీదైన బట్టలు వేసుకున్నప్పటికీ తినడానికి డబ్బులు లేక నూడుల్స్ తిని పొట్ట నింపుకునే వాళ్లమని, తమ పరిస్థితి గురించి చెప్పుకుని తాను, లారా తెగ నవ్వుకునేవారిమని దియా మీర్జా ఆ రోజుల్ని జ్ఞాపకం తెచ్చుకుంది. ఇదిలా ఉంటే దియా 2021లో నాగ్(nagarjuna) తో వైల్డ్ డాగ్(Wild Dog) మూవీలో నటించింది.













