విడాకులకు సిద్ధమైన మరో తార
బాలీవుడ్ నటి దియా మీర్జా, ఆమె భర్త సహిల్ సింఘా విడిపోతున్నారు. పరస్పర అంగీకారంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు దియా వెల్లడించింది. ఆమె ఈ విషయాన్ని సామాజిక మాధ్యమాల ద్వారా ప్రకటించింది. పదకొండేళ్ల పాటు జీవితాన్ని పంచుకున్న మేము ఇప్పుడు విడిపోవాలని నిర్ణయించుకున్నాం. మున్ముందు మంచి స్నేహితులుగా కొనసాగుతూ పరస్పర ప్రేమాభిమానాలతో ఉంటాం. మా ప్రయాణం విభిన్న దారుల్లో కొనసాగబోతున్నా, మా బంధం పట్ల ఎప్పటికీ ఆనందకరంగానే ఉంటామని తెలిపింది దియా. వీరి వివాహం 2014లో జరగ్గా, అంతకు కొన్నేళ్ల ముందు నుంచే వీరి మధ్య అనుబంధం ఉంది.













