ధృవ నక్షత్రం నుంచి అప్డేట్
చియాన్ విక్రమ్- గౌతమ్ మీనన్ కాంబినేషన్లో ధృవ నక్షత్రం ఎన్నాళ్ల నుంచో షూటింగ్ దశలోనే ఉంది. స్పై థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా రిలీజ్ గురించి ఇప్పటి వరకు క్లారిటీ లేదు. వాస్తవానికి ఈ సినిమా ఎప్పుడో రిలీజ్ కావాల్సింది కానీ సినిమా స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఏదొక రూపంలో సమస్యలు వస్తూనే ఉండటం, రిలీజ్ పోస్ట్‌పోన్ కావడం జరుగుతూనే ఉన్నాయి.
ఈ సమ్మర్లో సినిమా రిలీజ్ అవతుందనుకున్నారు కానీ మేకర్స్ ఏం స్పందించకపోయేసరికి ధృవ నక్షత్రం రిలీజ్ ఇప్పట్లో ఉండదనుకున్నారు. కానీ ఇప్పుడు డైరెక్టర్ గౌతమ్ మీనన్ ఈ సినిమా గురించి ఓ అప్డేట్తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమా నుంచి సెకండ్ సింగిల్ ను రెడీ చేయడానికి ముహూర్తం ఫిక్స్ అయినట్లు గౌతమ్ మీనన్ తన ట్విట్టర్ ద్వారా తెలిపాడు.
జులై19న ఈ సినిమా నుంచి రెండో లిరికల్ సాంగ్ రిలీజ్ కానుండగా ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందనేది ఇప్పుడు అందరిలోనూ ఆసక్తి మొదలవుతుంది. విక్రమ్ ఈ సినిమాలో జాన్ అనే స్పై క్యారెక్టర్ లో నటిస్తుండగా ఈ మూవీకి హారిష్ జయరాజ్ సంగీతం అందిస్తున్నాడు. హీరోయిన్లుగా ఐశ్వర్య రాజేష్, రీతూ వర్మ నటిస్తున్నారు. త్వరలోనే ఈ సినిమా ట్రైలర్ ను రిలీజ్ చేసే అవకాశాలున్నాయి.













