ధృవ2 స్క్రిప్ట్ రెడీ!
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కెరీర్ బెస్ట్ మూవీల్లో ఒకటైన ధృవ సినిమా తమిళ బ్లాక్ బస్టర్ తని ఒరువన్ రీమేక్ అన్న విషయం తెలిసిందే. ధృవ సినిమాకు సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించారు. ధృవ డిసెంబర్ లో రిలీజైనప్పటికీ అన్ని సెంటిమెంట్లని ఎదుర్కొని మరీ హిట్ అయింది. ఈ మూవీ వచ్చి కూడా ఎనిమిదేళ్లవుతోంది. ఎప్పటినుంచో ఈ సినిమాకు సీక్వెల్ కావాలని ఫ్యాన్స్ తెగ డిమాండ్ చేస్తున్నారు. తాజా సమాచారం ప్రకారం తని ఒరువన్ డైరెక్టర్ మోహన్ రాజా ఈ సినిమా సీక్వెల్ కు కథను రెడీ చేశారని, అతి త్వరలోనే ఈ సినిమా గురించి అఫీషియల్ అనౌన్స్మెంట్ రానుందని తెలుస్తోంది. చెన్నైలో ఏర్పాటు చేసిన తని ఒరువన్ స్పెషల్ స్క్రీనింగ్ లో తని ఒరువన్2 కు సంబంధించిన ఓ స్పెషల్ వీడియోను రిలీజ్ చేయబోతున్నట్లు తెలుస్తోది.
తమిళంలో తని ఒరువన్ కు సీక్వెల్ వస్తుందంటే ఇక్కడ కూడా రామ్ చరణ్ తో డిస్కషన్స్ జరిగే ఉంటాయి. చిరూతో గాడ్ ఫాదర్ టైమ్ లో మోహన్ రాజాకు, చరణ్ కు మధ్య ధృవ2కి సంబంధించిన చర్చలు జరిగినట్లు టాక్. ఇప్పుడు స్టోరీ ఫైనల్ అయింది కాబట్టి శంకర్, బుచ్చిబాబు సినిమాల తర్వాత చరణ్ ఈ సినిమా చేసే ఛాన్స్ ఎక్కువగా ఉంది.
కాకపోతే ఈసారి ధృవ2కి సురేందర్ రెడ్డి కాకుండా ఒరిజనల్ డైరెక్టర్ మోహన్ రాజానే దర్శకత్వం వహించే అవకాశం ఉంది. షూటింగ్ ఎప్పుడు, రిలీజ్ ఎప్పుడనేది సినిమా తెలుగులో కూడా అనౌన్స్ అయ్యాకే తెలుస్తోంది. వీలైనంత త్వరగా చరణ్ ధృవ2 చేస్తే బెటర్ అని ఫ్యాన్స్ అంటున్నారు. ఈ మూవీ తమిళ వెర్షన్ లో తని ఒరువన్ లో నటించిన జయం రవినే నటించనున్నాడు.













