తెలుగులో సినిమా తీయమని ధోనీకి రిక్వెస్ట్‌లు
ఒకప్పుడు తెలుగు సినీ పరిశ్రమ వేరు. ఇప్పుడు తెలుగు సినీ పరిశ్రమ వేరు. అన్ని పరిశ్రమలు తెలుగు ఇండస్ట్రీ వైపు దృష్టి పెట్టాయి. పాన్ ఇండియాలో తెలుగు మూవీల క్రేజ్ చూసి అందరూ టాలీవుడ్ లో సినిమాలు చేయాలని చూస్తున్నారు. తెలుగు సినిమాకు ఆస్కార్ రావడంతో ఈ క్రేజ్ చాలా ఎక్కువైంది. ఒకప్పుడు టాలీవుడ్ ని, టాలీవుడ్ సినిమాని విమర్శించిన వాళ్లే ఇప్పుడు తెలుగు సినిమా గురించి గొప్పగా మాట్లాడుకుంటున్నారు.
టాలీవుడ్ రేంజ్ ఎంతలా మారిందంటే ఏకంగా బాలీవుడ్ హీరోలు కూడా వచ్చి ఇక్కడ తమ సినిమాలను ప్రమోట్ చేసుకునేంత. అంతేకాదు తమ సినిమాల కోసం ఇక్కడి హీరోల హెల్ప్ తీసుకోవడానికి కూడా వారు వెనుకాడట్లేదు. ఈ నేపథ్యంలో మాజీ క్రికెటర్ ధోనీ టాలీవుడ్ లో ఎప్పుడు సినిమాలు తీస్తారంటూ నెటిజన్లు ఆశక్తిగా ఎదురుచూస్తున్నారు.
ప్రస్తుతం కోలీవుడ్ లో ధోనీ నిర్మాతగా LGM అనే టైటిల్‌తో ఓ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ను నిర్మిస్తున్నాడు. పెళ్లి, ఫ్యామిలీ ఎమోషన్స్ తో కూడిన కాన్సెప్ట్ తో ఈ సినిమా తెరకెక్కనుంది. మొదటి సినిమాతోనే ఫ్యామిలీ ఆడియన్స్ ను టార్గెట్ చేసిన ధోనీ టాలీవుడ్ లో సినిమాలు నిర్మిస్తే టాలీవుడ్ రేంజ్ మరింత పెరుగుతుందని టాలీవుడ్ మూవీ లవర్స్ అభిప్రాయపడుతున్నారు. మరి ధోనీ తన టాలీవుడ్ ఎంట్రీ ఎప్పుడిస్తాడో చూడాలి. ధోనీ ఓకే అంటే ఇక్కడి హీరోలంతా సినిమాలు చేయడానికి డేట్స్ ఇస్తారనడంలో ఎలాంటి సందేహం లేదు.













