కలిసి నటిస్తున్న ధోని, చరణ్ !!
ధోనికి, చరణ్ కి సంబంధం ఏముందనుకొంటున్నారా? క్రికెట్ అంటే మనకు గుర్తువచ్చే లిస్ట్ లో మన ఇండియా క్రికెటర్ మహేందర్ సింగ్ ధోని ఒకరు. ఇక మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అయితే ఆర్ఆర్ఆర్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ అయిపోయిన సంగతి తెలిసిందే. గతంలో ఒక కమర్షియల్ యాడ్స్ ద్వారా వీరి పరిచయం ఏర్పడింది. ఇప్పుడు మళ్ళీ కలిసి వీరిరువురు ఒక యాడ్ లో నటిస్తున్నారు.
రామ్ చరణ్ కు గేమ్స్ లో క్రికెట్ అంటే చాలా ఇష్టమని, ఏ మాత్రం ఖాళీ దొరికినా క్రికెట్ ఆడేందుకు వెళ్ళేవాడినని అనేక ఇంటర్వ్యూలలో తెలిపారు. తను తరుచుగా క్రికెట్ మ్యాచ్ లను చూస్తూ ఉంటానని చాలాసార్లు చెప్పారు. ఇదే కాకుండా ఇండియన్ క్రికెట్ టీమ్ లోని కొంతమందితో రామ్ చరణ్ కి మంచి స్నేహం కూడా ఉంది. మాజీ క్రికెట్ ప్లేయర్ సచిన్ టెండూల్కర్ మరియు మెగా స్టార్ చిరంజీవి మంచి స్నేహితులు కూడా. సచిన్ ఎప్పుడు హైదరాబాద్ వచ్చినా చిరుని కలుస్తూ ఉంటారు. ఇక రామ్ చరణ్ కూడా సచిన్ ను ఎంతగానో ఆరాధిస్తూ ఉంటాడు.
గతంలో ధోనితో చరణ్ కి కొన్ని కమర్షియల్ యాడ్స్ ద్వారా పరిచయం ఏర్పడింది. అప్పట్లో మగధీరతో విజయం అందుకున్న చరణ్ కు మంచి గుర్తింపు రావడంతో ఎంఎస్ ధోనితో కలిసి పెప్సీ యాడ్ లో కనిపించారు. మళ్ళీ ఇప్పుడు ధోనితో రామ్ చరణ్ తన స్క్రీన్ ని షేర్ చేసుకోబుతున్నారు. ఇద్దరూ కలిసి ఒక కమర్షియల్ యాడ్ ని చిత్రీకరిస్తున్నారు. దానికి సంబంధించిన ఆఫ్ స్క్రీన్ ఫొటోస్ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి.
ఆ ఫోటోలో ధోని హెయిర్ స్టైల్ చాలా డిఫరెంట్ గా మోస్ట్ హ్యాండ్సమ్ లుక్ లో కనిపించారు. తన పక్కనే రామ్ చరణ్ కూడా తనదైన లుక్ తో ఆకట్టుకున్నాడు. ఇక వీరిద్దరూ కలిసి ఒక ఫ్రేమ్ అనగానే ధోని, చరణ్ ఫ్యాన్స్ ఆనందంకి అవధులు లేకుండా పోయాయి. ఆర్ఆర్ఆర్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ అయిన చరణ్ కి ఇప్పుడు ఇంటర్నేషనల్ యాడ్స్ చేసే అవకాశాలు కూడా వస్తున్నాయి. మరి ఇప్పుడు తలైవా ధోనితో ఎటువంటి యాడ్ చేస్తున్నాడో వేచి చూడాల్సిందే.













