ధనుష్ కెరీర్లోనే ఇది ఫస్ట్ టైమ్
సినీ ఇండస్ట్రీలో ఇప్పుడు రెండు పార్టుల సినిమాలు ఎక్కువైపోయాయి. సినిమా రిలీజ్ కు ముందే రెండు భాగాలుగా రిలీజ్ కానుందని చెప్పి హైప్‌కు హైప్, బిజినెస్‌కు బిజినెస్ చేయడం నేర్చుకున్నారు మేకర్స్. అన్నీ బాగుండి సినిమా హిట్ అయితే సెకండ్ పార్ట్ గురించి ఆలోచిస్తున్నారు. లేదంటే దాని గురించి ఏమీ పట్టనట్లు వదిలేస్తున్నారు.
ఇప్పుడు ఈ లిస్ట్ లోకి తాజాగా ధనుష్ నటిస్తున్న కెప్టెన్ మిల్లర్ సినిమా జాయినైంది. అరుణ్ మాథేశ్వరన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను రెండు భాగాలుగా రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ అనౌన్స్ చేశారు. 1980ల కాలం నాటి నేపథ్యంలో భారీ యాక్షన్ అడ్వెంచర్ గా రూపొందుతున్న ఈ సినిమా నుంచి వచ్చిన పోస్టర్స్ సినిమాపై ఆసక్తిని పెంచుతున్నాయి.
ఇలాంటి టైమ్ లో కెప్టెన్ మిల్లర్ కు సెకండ్ పార్ట్ ఉంటుందని చెప్పి ఆ అంచనాలను మరింత పెంచారు మేకర్స్. ఒకే సినిమా రెండు భాగాలుగా రిలీజవడం ధనుష్ కెరీర్ లో ఇదే ఫస్ట్ టైమ్. భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ సినిమా మొదటి భాగంలో కన్నడ నటుడు శివ రాజ్ కుమార్ ఓ ప్రధాన పాత్రలో నటిస్తుండగా, టాలీవుడ్ యంగ్ హీరో సందీప్ కిషన్ ఓ కీ రోల్ చేస్తున్నాడు. కెప్టెన్ మిల్లర్ పార్ట్1 డిసెంబర్ 15న ప్రేక్షకుల ముందుకు రానుంది.













