Dhanush: పవన్ తో సినిమా చేయాలనుంది

కోలీవుడ్ సినిమాలో ఉన్న టాలెంటెడ్ హీరోల్లో ధనుష్(Dhanush) కూడా ఒకరు. ధనుష్ మల్టీ టాలెంటెడ్. హీరోగానే కాకుండా సింగర్ గా, లిరిక్ రైటర్ గా, డైరెక్టర్ గా, నిర్మాతగా పలు విభాగాల్లో పని చేసి అన్నింటిలోనూ సక్సెస్ అయ్యాడు. ధనుష్ ఇప్పటికే పలు సినిమాలకు దర్శకత్వం వహించగా అవన్నీ మంచి హిట్లుగా నిలిచిన సంగతి తెలిసిందే. అయితే ధనుష్ ఇప్పటివరకు కేవలం తమిళంలో మాత్రం సినిమాలను తీశాడు.
తమిళంలో తప్ప ఇప్పటివరకు ఏ ఇతర భాషలోనూ దర్శకత్వం వహించని ధనుష్ కు రీసెంట్ గా జరిగిన కుబేర(Kubera) ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఓ ప్రశ్న ఎదురైంది. ఒకవేళ తెలుగులో డైరెక్టర్ గా ఛాన్స్ వస్తే ఎవరితో చేస్తారని సుమ అడగ్గానే ధనుష్ వెంటనే పవన్ కళ్యాణ్(Pawan Kalyan) పేరు చెప్పాడు. దీంతో ఒక్కసారిగా ఆ ఈవెంట్ మొత్తం హోరెత్తిపోయింది. పవన్ కళ్యాణ్ కు తాను అభిమానిని అని గతంలోనే ధనుష్ చెప్పాడు.
ఇప్పుడు ఏకంగా ఛాన్స్ వస్తే పవన్ తో సినిమా చేస్తా అని చెప్పడంతో పవన్ ఫ్యాన్స్ కు ఈ విషయం చాలా ఎగ్జైటింగ్ గా అనిపిస్తుంది. అయితే ఈ కాంబినేషన్ కుదురుతుందా లేదా అనేది కాలమే నిర్ణయించాలి. దానికి కారణం పవన్ ప్రస్తుతం ఏపీ పాలిటిక్స్ లో బిజీగా ఉండటం వల్ల తాను ఒప్పుకున్న సినిమాలను పూర్తి చేయడానికే టైమ్ ఉండటం లేదు. మరి కొత్త సినిమాలను పవన్ ఒప్పుకుంటాడా అనేది ఆయనకే తెలియాలి.