కమ్ముల మూవీ తర్వాతే ఆ సినిమా
సెన్సిబుల్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల, లవ్ స్టోరీ సక్సెస్ తర్వాత చాలా గ్యాప్ తీసుకుని ధనుష్ హీరోగా సినిమాను అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో ధనుష్ తో పాటూ టాలీవుడ్ కింగ్ నాగార్జున కూడా ఓ కీలక పాత్ర చేయనున్నట్లు మేకర్స్ అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. భారీ బడ్జెట్తో ఈ సినిమాను ఏషియన్ మూవీస్ మరియు అమిగోస్ క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.
సార్ తర్వాత ధనుష్ చేస్తున్న రెండో తెలుగు స్ట్రయిట్ సినిమా ఇది. పొలిటికల్ కమ్ యాక్షన్ డ్రామాగా ఈ సినిమా తెరకెక్కనుంది. ఇదిలా ఉండగా ధనుష్ ప్రస్తుతం కెప్టెన్ మిల్లర్ రిలీజ్ లో బిజీగా ఉన్నాడు. దీంతో పాటూ ధనుష్ తన స్వీయ దర్శకత్వంలో ఓ భారీ బడ్జెట్ పాన్ ఇండియా సినిమాను కూడా అనౌన్స్ చేశారు.
ఆ సినిమా శేఖర్ కమ్ముల మూవీ అయ్యాకే స్టార్ట్ అవనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం నా సామిరంగ సినిమా చేస్తున్న నాగ్ ఆ సినిమా పూర్తి కాగానే శేఖర్ కమ్ముల సినిమాలో జాయిన్ కానున్నట్లు సమాచారం. శేఖర్ కమ్ముల కెరీర్లోనే బిగ్గెస్ట్ మూవీగా ఈ సినిమా తెరకెక్కబోతుంది. ఈ సినిమా 2025 మొదటి నెలల్లోనే రిలీజ్ కానున్నట్లు తెలుస్తోంది.













