ఇక్కడ ‘వకీల్ సాబ్’ అక్కడ ‘కర్నన్’ ఒకే రేంజ్ హిట్ అటా!
ధనుష్ నటించిన ‘కర్నన్’ మూవీ గురించి చర్చించుకుంటున్నారు తమిళ్ జనం . 50 పెర్సెంట్ అక్కుఫెన్సీ తో 50 కోట్లు కలెక్ట్ చేసిందట! మరి ఇక్కడ వకీల్ సాబ్ ఫుల్ అక్కుఫెన్సీ తో 100 కోట్ల కలెక్షన్స్ వసూల్ చేసింది. ఆ విధంగా చూసుకుంటే ఈ రెండు చిత్రాలు ఒకే రేంజ్ హిట్ హిట్ అని చెప్పొచ్చు. విషయానికొస్తే…. ముందుగా అనుకున్న సమయానికే ఏప్రెల్ 9న ఈ సినిమా రిలీజ్ అయ్యింది. డైరెక్టర్ మారి సెల్వరాజ్ మూవీ. అయితే, ధనుష్ నటనకి విమర్శకుల నుంచీ, ప్రేక్షకుల నుంచీ అద్భుతమైన ప్రశంసలు అందుతున్నప్పటికీ, తమిళనాడులో కరోనా కేసుల దృష్ట్యా 50 శాతం ఆడియన్స్ ను మాత్రమే సినిమా హాల్స్ లోకి అనుమతిస్తున్నారు. అయినా కూడా తొలి రోజు స్పందన చూసి ఫుల్ జోష్ లో ఉన్నారు దర్శకనిర్మాతలు, నేరుగా థియేటర్స్ వద్ద జనాల్ని కలసి సంబరాల్లో పాలుపంచుకుంటున్నారు ‘కర్నన్’ మూవీ టీమ్. ఈ సినిమాతో పాటు విడుదలైన వకీల్ సాబ్ కూడా తెలుగులో సూపర్ హిట్ అయ్యింది. అయితే ఈ రోజుతో రెండు సినిమాలు మొదటి వరాన్ని పూర్తి చేసుకున్నాయి.
ధనుష్ కర్ణన్ సినిమా మొదటి వారనికి 50 కోట్ల కలెక్షన్స్ సంపాదించాగా , ఇక్కడ వకీల్ సాబ్ 100 కోట్ల కలెక్షన్స్ ని సంపాదించింది. ఒకే రోజు విడుదలైన ఇద్దరు స్టార్ హీరోస్ సినిమాల గురించి సినీ ప్రేక్షక జనం ఇప్పుడు మాట్లాడుకుంటుంది. ముఖ్యంగా చాలా సంవత్సరాల తర్వాత పవన్ కళ్యాణ్ సినిమాకి మొదటి ఆట నుంచి పాజిటివ్ టాక్ రావడంతో అభిమానుల ఆనందానికి అవధులు లేవు. ఈ సినిమాలో కోర్ట్ సీన్స్ అన్ని సూపర్ గా వచ్చాయి అని అభిమానులు పండగ చేసుకుంటున్నారు. హిందీలో విడుదలై సూపర్ హిట్ అయిన పింక్ సినిమా రీమేక్ గా వస్తున్న ఈ వకీల్ సాబ్ లో పవన్ కళ్యాణ్ లాయర్ పాత్రలో అదరగొట్టాడు. ఈ వకీల్ సాబ్ ని బోనీ కపూర్ , దిల్ రాజు కలిసి భారీ గా నిర్మించారు. నాని తో ఎంసిఎ సినిమా తీసిన శ్రీరామ్ వేణు ఈ సినిమాకి దర్శకత్వం వహించి ఒక రీమేక్ సినిమాని చాలా బాగా హ్యాండిల్ చేసాడు అని పేరు తెచ్చుకున్నాడు.













