Dhanush: మొదటి నుంచి చెఫ్ అవాలని ఉండేది

తమిళ స్టార్ హీరో ధనుష్(Dhanush) గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఎలాంటి పాత్రలోనైనా ఇమిడిపోయి ఆ పాత్రకు తన బెస్ట్ ఇస్తాడు ధనుష్. అందుకే పలుసార్లు ఆయనకు నేషనల్ అవార్డులు దక్కాయి. ధనుష్ దర్శకత్వం వహిస్తూ నటించిన తాజా చిత్రం ఇడ్లీ కడై(Idli kadai). ఓ సాధారణ ఇడ్లీ కొట్టు నడిపే వ్యక్తి కథగా తెరకెక్కిన ఈ మూవీ మరింత ఎమోషనల్ గా సాగనుందని చిత్ర యూనిట్ చెప్తూ వస్తోంది.
అక్టోబర్ 1న ఇడ్లీ కడై ప్రేక్షకుల ముందుకు రానుండగా, రిలీజ్ దగ్గర పడుతున్న నేపథ్యంలో చిత్ర యూనిట్ ప్రమోషన్స్ లో భాగంగా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ను కోయంబత్తూరు లో నిర్వహించగా, అందులో ధనుష్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. చెఫ్ అవాలని తనకెప్పటి నుంచో ఉందని, అందుకే తనకు చెఫ్ పాత్రలు వస్తున్నాయేమో అని ధనుష్ అన్నాడు.
చెఫ్ క్యారెక్టర్ తనను రియల్ లైఫ్ లో కూడా ఎంతో ప్రభావితం చేసిందని, అందుకే తన కోసం తానేమైనా స్క్రిప్ట్ రాసుకునేటప్పుడు చెఫ్ గానే ఊహించుకుంటానని, చెఫ్ పాత్రపై తనకున్న ఇష్టం వల్లే అలాంటి క్యారెక్టర్లు వస్తున్నాయేమో అనిపిస్తుందని ధనుష్ చెప్పాడు. మనం ఏమనుకుంటే జీవితంలో అదే జరుగుతుందని, యూత్ కూడా అలానే తమ టార్గెట్స్ ను సాధించే దిశగా నమ్మకంతో అడుగులేసి సక్సెస్ అవాలని ధనుష్ సలహా ఇచ్చాడు.