ముంబై బ్యాక్ డ్రాప్ లో కమ్ముల సినిమా
సెన్సిబుల్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్న శేఖర్ కమ్ముల తన తర్వాతి సినిమా కోసం పూర్తిగా రూట్ మార్చేశాడు. ధనుష్- నాగార్జున కాంబినేషన్లో రూపొందుతున్న పాన్ ఇండియా మూవీని మాఫియా బ్యాక్ డ్రాప్ లో రూపొందించాడట శేఖర్ కమ్ముల. ఇటీవలె రెగ్యులర్ షూటింగ్ కు వెళ్లిన ఈ సినిమా ముంబై బ్యాక్ డ్రాప్ లో జరగనుందట.
90వ దశకంలో దేశాన్ని ఒణికించిన మాఫియా మూలాలు ముంబైలోని ధారావి అనే ప్రాంతంలో ఉన్నాయి. ఇంటర్నేషనల్ పోలీసులను సైతం ఒణికించిన దావూద్ ఇబ్రహీం చరిత్ర ఇక్కడే మొదలైంది. ఈ నేపథ్యాన్ని మూల కథగా తీసుకుని శేఖర్ కమ్ముల ఈ సినిమాను రూపొందించాడట. అయితే ఈ సినిమా దావూద్ కు సంబంధించిన కథ కాదు. కేవలం ఆ ప్రాంతంలోని పరిస్థితులను లెక్కలోకి తీసుకుని సొంతంగా అల్లుకున్న కథగా తెలుస్తోంది.
ఇంకా ధనుష్, నాగార్జున పాత్రలకు సంబంధించి ఎలాంటి లీక్స్ రాలేదు. రష్మిక కు మాత్రం మరోసారి నటనకు ప్రాధాన్యమున్న పాత్ర దక్కినట్లు తెలుస్తోంది. రెగ్యులర్ గా హీరోతో ఆడిపాడే పాత్ర కాకుండా కథను నడిపించే విధంగా రష్మిక పాత్రను డిజైన్ చేశాడట శేఖర్ కమ్ముల. దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా కు ధారావి అనే టైటిల్ ను పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ మూవీని ఈ ఏడాది ద్వితీయార్థంలో లేదంటే సంక్రాంతికి రిలీజ్ చేయాలని మేకర్స్ ప్రయత్నాలు చేస్తున్నారట. మరి తన స్టైల్ ను మార్చి శేఖర్ కమ్ముల చేస్తున్న ప్రయత్నం ఎలాంటి ఫలితాన్నిస్తుందో చూడాలి.













