లోకల్ బాయ్ ఫస్ట్‌లుక్ విడుదల
ధనుష్ కథానాయకుడిగా తమిళంలో తెరకెక్కిన పటాస్ తెలుగులో లోకల్ భాయ్ గా విడుదల కాబోతోంది. దురై సెంథిల్ కుమార్ దర్శకుడు. మెహరీన్ కథానాయిక. స్నేహ కీలక పాత్ర పోషించారు. నవీన్‌చంద్ర ప్రతినాయకుడిగా నటించారు. విఘ్నేశ్వర ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై సీహెచ్ సతీష్ కుమార్ ఫిబ్రవరిలో ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఫస్ట్‌లుక్‌ని విడుదల చేశారు. ఈ సందర్భంగా నిర్మాత సతీష్‌కుమార్ మాట్లాడుతూ యుద్ధకళల నేపథ్యంలో తెరకెక్కిన చిత్రమిది. తమిళంలో సంక్రాంతికి విడుదలై మంచి వసూళ్లని రాబట్టింది. ఈ చిత్రం కోసం ప్రత్యేక శిక్షణ తీసుకుని నటించారు ధనుష్. లోకల్ కుర్రాడిగా ఆయన చేసే హంగామా అలరిస్తుంది అన్నారు. సంగీతం: వివేక్-మెర్విన్.













