Dhanush: యాక్టింగ్ కంటే డైరెక్షనే ఇష్టం

మల్టీ టాలెంటెడ్ హీరోగా ధనుష్ కు ప్రత్యేక ఐడెంటిటీ ఉంది. హీరోగా, డైరెక్టర్ గా, నిర్మాతగా, సింగర్ గా, పాటల రచయితగా ధనుష్(Dhanush) చేసిన ప్రతీ పనిలోనూ సక్సెస్ అయ్యాడు. ప్రస్తుతం ధనుష్, టాలీవుడ్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల(sekhar kammula) దర్శకత్వంలో కుబేర(Kubera) అనే సినిమా చేసిన సంగతి తెలిసిందే. జూన్ 20న కుబేర ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.
ప్రమోషన్స్ లో భాగంగా చిత్ర యూనిట్ చెన్నైలో ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించగా ఆ ఈవెంట్ లో ధనుష్ చేసిన కామెంట్స్ అందరినీ ఆశ్చర్యపరిచాయి. తనకు యాక్టింగ్ కంటే డైరెక్టర్ గా ఉండటమే ఇష్టమని, కెమెరా ముందు హీరోగా చేయడం కంటే, కెమెరా వెనుక ఉండి డైరెక్టర్ గా సినిమా చేయడమే ఎక్కువ ఇష్టమని ధనుష్ చెప్పాడు.
ఎవరైనా వచ్చి తనను యాక్టర్- డైరెక్టర్ రెండింటి మధ్యలో నిల్చోబెట్టి ఒకటి ఎంచుకోమంటే తాను డైరెక్షన్ నే ఎంచుకుంటానని చెప్పి ధనుష్ అందరినీ ఆశ్చర్యపరిచాడు. ఫ్యాన్స్ కోసమే తాను నటుడిగా ఉంటున్నానని, తన సినిమాలో కోసం అభిమానులు ఎదురుచూస్తుంటారనే తాను హీరోగా సినిమాలు చేస్తున్నానని, లేకపోతే ఎప్పుడో యాక్టింగ్ ఆపేసి డైరెక్టర్ గా మారిపోయేవాడినని ధనుష్ తెలిపాడు. ధనుష్ చేసిన ఈ కామెంట్స్ ప్రస్తుతం నెట్టింట వైరలవుతున్నాయి.