ధనుష్ తో కామెడీ చేయిస్తున్న శేఖర్ కమ్ముల
కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ హీరోగా టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున కీలక పాత్రలో శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా కుబేర. ఈ సినిమాలో నాగార్జున ఈడీ ఆఫీసర్ గా కనిపించనున్నాడని టాక్. ఇప్పటికే కొన్ని షెడ్యూల్స్ షూటింగ్ ను పూర్తి చేసుకున్న కుబేర అవరసమైన మేరకు ప్రత్యేక సెట్స్ నిర్మించి కూడా షూటింగ్ నిర్వహించారు.
బ్యాంకాక్ లో రోడ్లపై భారీ ఛేజింగ్ సీన్స్ ను షూట్ చేశారు. ఈ సీన్స్ లో నాగ్ పాత్ర బాగా హైలైట్ అవుతుందని తెలుస్తోంది. ఇదిలా ఉంటే ఈ సినిమా షూటింగ్ తాజాగా విదేశాల నుంచి హైదరాబాద్ కు చేరుకున్నట్లు సమాచారం. ప్రస్తుతం రామోజీ ఫిల్మ్ సిటీలో కుబేర షూటింగ్ జరుగుతుంది. గుడి నేపథ్యంలో సాగ్ సీన్స్ తో పాటూ, మరికొన్ని సీన్స్ ను ధనుష్ పై షూట్ చేస్తున్నారు.
ఈ సినిమాలో ఈ సీన్స్ ఎంతో ఇంట్రెస్టింగ్ గా ఉంటాయని యూనిట్ వర్గాలంటున్నాయి. అంతే కాదు కుబేరలో ధనుష్ తో కామెడీ కూడా చేయిస్తున్నాడట డైరెక్టర్ శేఖర్ కమ్ముల. అంటే మాఫియా స్టోరీలో శేఖర్ కమ్మలు ధనుష్ తో కామెడీ టచ్ కూడా ఇప్పించనున్నాడన్నమాట. రష్మిక హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలేర్పడుతున్నాయి. శేఖర్ కమ్ముల కెరీర్లో ఇదే మొదటి పాన్ ఇండియా సినిమా కావడంతో కుబేరను ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్నాడు.













