తెలుగు లో మరో డైరెక్ట్ మూవీ చేయబోతున్న హీరో ధనుష్..?
పాన్ ఇండియా సినిమాల దయవల్ల తెలుగు సినిమా రేంజ్ ఏ మారిపోయింది. ఎప్పుడూ లేని విధంగా సౌత్ స్టార్ హీరోలు టాలీవుడ్ ఇండస్ట్రీపై దృష్టి పెడుతున్నారు. ఇప్పటికే కొంతమంది కోలీవుడ్ స్టార్స్ తెలుగులో సినిమాలు చేస్తున్నారు. అందులో ధనుష్ మిగతా హీరోలకు మించి ఆసక్తిని చూపిస్తున్నాడని తెలుస్తుంది. తెలుగు, తమిళ భాషల్లో తన సినిమాలు వుండేలా చూసుకుంటున్నాడు ఈ హీరో.
రీసెంట్ గా యూత్ ఫుల్ డైరెక్టర్ వెంకీ అట్లూరి డైరెక్షన్ లో తెలుగు తమిళ, భాషల్లో ద్విభాషా చిత్రంగా “సార్” మూవీని తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాని సితార ఎంటర్ టైన్ మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్ లపై సూర్యదేవర నాగవంశీ సాయి సౌజన్య సంయుక్తంగా నిర్మిస్తున్నారు. సంయుక్త మీనన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీ చిత్రీకరణ పూర్తి చేసుకుని ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ ప్రాసెస్ లో ఉంది.
ఫిబ్రవరి 17న “సార్” సినిమాని తెలుగు, తమిళ భాషలలో ఒకేసారి రూపొందించబోతున్నారు. త్వరలోనే ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కాబోతోంది. ఒకవైపు ఈ సినిమా పనులు జరుగుతున్న తరుణంలోనే హీరో ధనుష్ తెలుగులో ముచ్చటగా మూడవ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా వార్తలు వస్తున్నాయి. సోషల్ మీడియా లో ఆసక్తికరమైన వార్త చక్కర్లు కొడుతోంది. ఈ మూవీకని టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు నిర్మించనున్నారట.
‘శ్రీకారం’ మూవీతో దర్శకుడిగా పరిచయమైన కిషోర్ ఈ మూవీకి దర్శకత్వం వహించనున్నాడని సమాచారం. ధనుష్, దిల్ రాజు, డైరెక్టర్ కిషోర్, ఈ క్రేజీ కాంబినేషన్ లో కొత్త సినిమా పట్టాలెక్కబోతుందని గట్టిగా వార్తలు వినిపిస్తున్నాయి. ఈ దిశగా చూస్కుంటే రానున్న రోజులూ సౌత్ స్టార్స్ డైరెక్ట్ తెలుగు సినిమాలు చేసే అవకాశం ఎక్కువగానే ఉన్నట్లు కనిపిస్తుంది.













