Dhanush: శేఖర్ కమ్ముల గురించి ముందు తెలియదు

తెలుగు చిత్ర పరిశ్రమలోని టాలెంటెడ్ డైరెక్టర్లలో శేఖర్ కమ్ముల(sekhar kammula) కూడా ఒకరు. ఇప్పటికే ఆయన ఆనంద్(anand), గోదావరి(godavari), లీడర్(leader), ఫిదా(Fidaa), లవ్ స్టోరీ(love story) లాంటి క్లాసిక్ సినిమాలను ఇండస్ట్రీకి అందించారు. సెన్సిబుల్ విషయాలపై సినిమాలు తీసి సెన్సిబుల్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్న శేఖర్ కమ్ముల ఇప్పుడు ధనుష్(dhanush) తో కలిసి చేస్తున్న కుబేర(Kubera) కోసం తన జానర్ ను మార్చాడని ట్రైలర్ తో క్లారిటీ వచ్చేసింది.
జూన్ 20న కుబేర రిలీజ్ కానుండగా ప్రమోషన్స్ లో భాగంగా చెన్నైలో ఏర్పాటు చేసిన ప్రీ రిలీజ్ ఈవెంట్ లో శేఖర్ కమ్ముల గురించి ధనుష్ చేసిన వ్యాఖ్యలు ఆశ్చర్యాన్ని కలిగించాయి. తెలుగులో శేఖర్ కమ్ములకు మంచి ఫాలోయింగ్ ఉన్నప్పటికీ ధనుష్ కు కుబేర కథ వినే టైమ్ కు అసలు అతనెవరో కూడా తెలియదని, కథ విన్నాకే అతని గురించి తెలుసుకున్నానని చెప్పాడు.
కరోనా టైమ్ లో వీడియో కాల్ లో తనకు శేఖర్ కమ్ముల 20 నిమిషాల పాటూ కథను నెరేట్ చేశాడని, కథ ఓకే చేశాక అతని గురించి వేరే వాళ్లను అడిగి తెలుసుకుని, ఆ తర్వాతే ఆయన సినిమాలు చూసి అతని గొప్పతనం తెలుసుకున్నానని, కథ చెప్పాక రెండేళ్ల పాటూ ఆ స్క్రిప్ట్ ను డెవలప్ చేసి ఫైనల్ వెర్షన్ చెప్పారని, స్క్రిప్ట్ చాలా అద్భుతంగా ఉండటంతో ఈ సినిమా గ్రాండ్ స్కేల్ లో ఉంటుందనుకుని ఎన్నో ఊహించుకుని షూటింగ్ కు వెళ్తే మొదటి రోజే తిరుపతి నడి రోడ్డు మీద ఎండలో నిలబెట్టి అమ్మా అని అనుక్కునేలా చేశారని తన పాత్ర గురించి చమత్కరించాడు ధనుష్. కుబేర సినిమా విషయంలో ఎంతో కాన్ఫిడెంట్ గా ఉన్నానని, తనను నమ్మి ఈ సినిమా చూడాల్సిందిగా ధనుష్ ప్రేక్షకుల్ని కోరాడు.