Dhanush: ఏఐ వాడి క్లైమాక్స్ లో మార్పు.. లీగల్ గా చర్యలు తీసుకోనున్న ధనుష్
2013లో ధనుష్(dhanush) హీరోగా సోనమ్ కపూర్(sonam kapoor) హీరోయిన్ గా ఆనంద్ ఎల్ రాయ్(anand l roy) దర్శకత్వంలో వచ్చిన సినిమా రంఝానా(raanjhanaa). ఈ సినిమా క్లైమాక్స్ లో ధనుష్ చనిపోవడంతో తమిళ ఆడియన్స్ కు అప్పుడా సినిమా పెద్దగా ఎక్కలేదంటుంటారు. అయితే రీసెంట్ గా ఈ సినిమాను మేకర్స్ రీరిలీజ్ చేశారు. కేవలం రీరిలీజ్‌తో ఆగకుండా క్లైమాక్స్ ను మార్చేశారు.
ఈ సినిమాలో ధనుష్ చనిపోతే, అతడిని ఏఐ ద్వారా బతికించి క్లైమాక్స్ ను మార్చేశారు. ఈ విషయం తెలుసుకున్న డైరెక్టర్, హీరో ధనుష్ మేకర్స్ పై ఫైర్ అయ్యారు. సినిమాలో నటించిన నటీనటుల పర్మిషన్ లేకుండా వారి యాక్టింగ్ ను ఎలా మారుస్తారని మండిపడుతూ ఈ విషయంలో డైరెక్టర్ తో కలిసి చట్టపరమైన చర్యలు తీసుకోవడానికి హీరో ధనుష్ సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది.
దీన్ని ఇలానే వదిలేస్తే భవిష్యత్తులో మరిన్ని సినిమాలకు కూడా ఇదే పరిస్థితి ఎదురవుతుందని, అసలు మూవీ క్లైమాక్స్ ను మార్చడమంటే సినిమా యొక్క ఆత్మను చంపేయడమేనని, గత 12 ఏళ్లుగా ఆడియన్స్ గుండెల్లో పెట్టుకున్న నమ్మకాన్ని పూర్తిగా ఉల్లంఘించడమేనని డైరెక్టర్ ఆనంద్ రాయ్ చెప్తూ మేకర్స్ పై అసంతృప్తి వ్యక్తం చేశారు.







