చివరి దశలో ధమ్కీ
రజిత్, త్రిషాలాషా జంటగా దర్శకుడు ఏనుగంటి తెరకెక్కిస్తోన్న క్రైమ్ యాక్షన్ థ్రిల్లర్ ధమ్కీ. సుంకర సత్యనారాయణ నిర్మాత. వాస్తవిక సంఘటలన ఆధారంగా తెరకెక్కుతోన్న చిత్రం క్లైమాక్స్ సన్నివేశాల చిత్రీకరణ జరుపుకుంటోంది. ఎస్బి ఆనంద్ సంగీతం, దీపక్ భగవంత్ సినిమాటోగ్రఫీ సమకూరుస్తున్నారు. దర్శకుడు ఏనుగంటి మాట్లాడుతూ వాస్తవ సంఘటలన ఆధారం చేసుకుని క్రైమ్ యాక్షన్ థ్రిల్లర్‌గా రాసుకున్న కథే ధమ్కీ. ఈ జోనర్లో ఉండాల్సిన అన్ని అంశాలనూ కథలో మేళవించాం. ఆడియన్స్‌ని పూర్తిస్థాయిలో ఎంటర్టైన్ చేసే సినిమా ఇది. ప్రస్తుతం క్లైమాక్స్ షూటింగ్ జరుగుతోంది. సినిమాకు నిర్మాత సహకారం మర్చిపోలేనిదని అన్నారు. నిర్మాత సుంకర సత్యనారాయణ మాట్లాడుతూ ధమ్కీ షూటింగ్ చివరి దశకు చేరడంతో పోస్ట్ ప్రొడక్షన్స్‌పై దృష్టిపెట్టాం. చిత్రంలోని కొన్ని సన్నివేశాలను దర్శకుడు మెస్మరైజింగ్‌గా తెరకెక్కించాడు. త్వరలో విడుదల తేదీ ప్రకటిస్తాం అన్నారు.













