ధాకడ్ ఫస్ట్ లుక్ విడుదల
జడ్జిమెంటల్ హై క్యా అనంతరం కంగనా రనౌత్ నటిస్తున్న ధాకడ్ చిత్రం ఫస్ట్ లుక్ విడుదలైంది. అయితే ఈ ఫస్ట్ లుక్ కంటే ఈ చిత్రం గురించి కంగనా ఇస్తున్న స్టేట్మెంట్ అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. చర్చనీయాంశమవుతోంది. మణికర్ణికతో ఫిమేల్ హీరోల సినిమాలు ఆదరించడానికి ప్రేక్షకులు సిద్దంగా ఉన్నారని తెలిసింది. అందుకే మరో మాస్ యాక్షన్ ఎంటర్టైనర్తో నేను మీ ముందుకొస్తున్నాను. ఇది నా కెరీర్ని మాత్రమే కాదు.. ఇండియన్ సినిమా గతినే మార్చేంత ప్రతిభావంతమైన చిత్రంగా నిలవనుంది. ఇప్పుడు నేను చెబుతున్న మాటలు అతిశయోక్తి కాదు అంటోంది కంగనా. దానితో సహజంగానే ఈ సినిమాపై అందరి దృష్టి మళ్లుతోంది.













