Mangalavaram2: మంగళవారం2కు డివోషనల్ టచ్
ఆర్ఎక్స్100(RX100) సినిమాతో డైరెక్టర్ గా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన అజయ్ భూపతి(Ajay Bhupathi) మొదటి సినిమాతోనే సూపర్ హిట్ అందుకున్నాడు. ఆ తర్వాత మహాసముద్రం(Maha Samudram) సినిమా చేసి ఎన్నో అంచనాలతో ఆ సినిమాను రిలీజ్ చేశాడు కానీ అది డిజాస్టర్ అయింది. దీంతో తన లక్కీ హీరోయిన్ పాయల్ రాజ్పుత్(Payal Rajput) తో కలిసి మంగళవారం(Mangalavaram) సినిమా చేశాడు అజయ్.
సైకలాజికల్ మిస్టరీ థ్రిల్లర్ గా ప్రేక్షకుల ముందుకొచ్చిన మంగళవారం సినిమా అందరినీ ఆకట్టుకుంది. ఆ సినిమాతో డైరెక్టర్ అజయ్ భూపతి మరోసారి తనను తాను నిరూపించుకున్నాడు. ఇదిలా ఉంటే మంగళవారం సినిమా రిలీజైనప్పుడు మంగళవారం2(Mangala varam2)కూడా ఉంటుందని చిత్ర యూనిట్ చెప్పింది. కాకపోతే అది సీక్వెల్ కాదు ప్రీక్వెల్.
మంగళవారం సినిమాలో కథ ఎండ్ అయిపోతుంది కాబట్టి దానికి సీక్వెల్ ఛాన్స్ పెద్దగా లేదు అందుకే ప్రీక్వెల్ చేయనున్నారు. మంగళవారం2 కు సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ ను ఆల్రెడీ అజయ్ భూపతి పూర్తి చేశాడని, త్వరలోనే సినిమాను సెట్స్ పైకి కూడా తీసుకెళ్లనున్నాడని అంటున్నారు. అయితే ఈ సినిమాను హర్రర్ నేపథ్యంలో తెరకెక్కిస్తూ దానికి డివోషనల్ టచ్ ఇవ్వనున్నాడట అజయ్ భూపతి. ఈ మధ్య డివోషనల్ సినిమాలకు మంచి ఆదరణ పెరుగుతున్న నేపథ్యంలో మంగళవారం2కు ఈ అంశం చాలా ప్లస్ అయ్యే ఛాన్సుంది.













