20 రోజుల్లో దేవీ బ్యాక్ టు బ్యాక్ సినిమాలు
ప్రస్తుత రోజుల్లో ఓ మ్యూజిక్ డైరెక్టర్ నుంచి పాన్ ఇండియా ఇనిమా మూడు నెలలకు ఒకటి రావడమే ఎక్కువ. అలాంటిది 20 రోజుల గ్యాప్ లో దేవీ శ్రీ ప్రసాద్(Devi Sri Prasad) నుంచి రెండు పెద్ద క్రేజీ ప్రాజెక్టులు రిలీజ్ కానున్నాయి. నవంబర్ 14న రాబోతున్న కంగువ(Kanguva) సినిమాకు ఏకంగా కోలీవుడ్ బాహుబలి(Baahubali) రేంజ్ లో అంచనాలు పెట్టుకున్నారు.
సూర్య(Suriya)తో పాటూ టీమ్ మొత్తం ఈ సినిమాపై ఎంతో కాన్ఫిడెన్స్ తో ఉంది. తమిళ డిస్ట్రిబ్యూటర్లు ఎప్పుడూ చూడని పెద్ద నెంబర్లు ఈ సినిమా చూపించనుందని ఎంతో బలంగా నమ్ముతున్నారు. అయితే దేవీశ్రీ(DSP) ఇప్పటివరకు తమిళంలో చాలానే సినిమాలు చేశాడు. కానీ అవన్నీ ఒకెత్తు అయితే కంగువ మరో ఎత్తు. ఈ సినిమా బ్లాక్ బస్టర్ అయితే దేవీ పేరు మరోసారి నేషనల్ లెవల్ లో మారుమోగడం ఖాయం.
అనిరుధ్(Anirudh) సత్తా చాటుతున్న కోలీవుడ్ లో తనదైన ముద్ర వేయడానికి దేవీకి ఇంతకంటే గొప్ప ఛాన్స్ ఉండదు. ముఖ్యంగా బీజీఎం విషయంలో నమ్మకం నిలబెట్టుకుంటే చాలు. కంగువ తర్వాత 20 రోజులకు డిసెంబర్ 5న పుష్ప2(Pushpa2) వస్తుంది. ఇప్పటికే రూ.1000 కోట్లకు పైగా ప్రీ రిలీజ్ బిజినెస్ తో పుష్ప దూసుకెళ్తున్నాడు. కంగువ, పుష్ప2 రెండూ హిట్టయితే దేవీ బ్యాక్ టూ ట్రాక్ అని చెప్పుకోవచ్చు













