బాలీవుడ్ కి డీఎస్పీ జంప్ …?
దేవిశ్రీ ప్రసాద్…ఒకప్పుడు ఏ నోట విన్నా ఈ పేరే వినిపించేది. దేవి మ్యూజిక్ అంటే ఫుల్ క్రేజ్ ఉండేది. కొన్ని సంవత్సరాలపాటు తన మ్యూజిక్ తో రాక్ స్టార్ గా దేవి టాలీవుడ్ ని ఎలాడాలంటే అతిశయోక్తి కాదు. అటువంటి దేవి వేగం కాస్త తగ్గింది అనే వార్తలు మ్యూజిక్ లవర్స్ నుండి వినిపిస్తున్నాయి.
లేటెస్ట్ గా థమన్, గోపిసుందర్ వంటి సంగీత దర్శకులు స్పీడ్ అప్ అవ్వడంతో దేవి స్లో అయ్యారనే చెప్పాలి. వరుసగా స్టార్ హీరోలందరికీ థమన్ మ్యూజిక్ అందిస్తున్న సంగతి తెలిసిందే. అయితే వేగం తగ్గినా అవకాశాలు మాత్రం తగ్గలేదు.
ప్రస్తుతం దేవి బాలీవుడ్ పై ఫోకస్ చేస్తున్నట్లు సమాచారం. ఇదే సమయంలో సరిగ్గా హిందీలో రోహిత్ శెట్టి దర్శకత్వం వహిస్తున్న చిత్రానికి అవకాశం వచ్చింది. దీంతో దేవి నిజంగానే బాలీవుడ్ కి షిఫ్ట్ అవుతున్నారా..? అన్న సందేహాలు వెలువడ్డాయి.
” వాల్తేరు వీరయ్య ” వంటి పెద్ద సినిమాలు డీఎస్పీ చేతిలో ఉన్నా ఆయన పెద్దగా ఇంట్రెస్ట్ చూపించట్లేదని, అందుకే బాస్ పార్టీ సాంగ్ పై అంత ఎఫర్ట్స్ పెట్టలేదని వార్తలొచ్చాయి. అయితే, ఈ పాట ఒకరకం మ్యూజిక్ లవర్స్ ని బాగానే మెప్పించింది. దీంతో బాస్ సినిమా మీదకంటే బాలీవుడ్ సినిమా మీదే ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసాడని దేవి పై ట్రోలింగ్ జరిగింది.
ఇక వాస్తవంలోకి వెళ్తే…టీ సిరీస్ మ్యూజిక్ డైరెక్టర్స్ ని ఎంపిక చేసే విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటుంది. ఒక సినిమాకి ఒక్క మ్యూజిక్ డైరెక్టర్ నే సెలెక్ట్ చేయరు. రోహిత్ శెట్టి చిత్రానికి దేవి తో పాటు లిజో జాజ్ మరియు డీజె చేతాస్ మ్యూజిక్ ని అందించారు. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ మరొకరు కంపోజ్ చేసారు.
విషయం ఏంటంటే డీఎస్పీ ఈ సినిమాకి కేవలం రెండు పాటలనే అందించారు. బ్యాలన్స్ పాటలు మిగిలిన ఇద్దరు కంపోజ్ చేసారు. కాబట్టి దేవి బాలీవుడ్ ప్రాజెక్ట్స్ పై మాత్రమే దృష్టి పెడుతున్నాడు అనడానికి ఎలాంటి స్కోప్ లేదు. ప్రెజెంట్ దేవిశ్రీ ప్రసాద్ అల్లు అర్జున్ పాన్ ఇండియా మూవీ ” పుష్ప -2 ” కి మ్యూజిక్ అందిస్తున్న విషయం తెలిసిందే…













