దేవీ చేతిలో క్రేజీ ప్రాజెక్టులు
గత కొన్ని సినిమాలుగా దేవీ శ్రీ ప్రసాద్ సంగీతంలో తన ముద్ర చూపించలేకపోతున్నాడనే విమర్శ బాగా వినపడుతోంది. పుష్ప1 తో వచ్చిన సక్సెస్ ను నిలబెట్టుకోలేకపోతున్నాడు దేవీ. ఆ తర్వాత వచ్చిన రౌడీ బాయ్స్, ఖిలాడీ, ది వారియర్, రంగ రంగ వైభవంగా అన్నీ ఒకదానికి మించి మరొకటి ఉన్నాయి. కంటెంట్ పరంగానే కాదు, మ్యూజిక్ పరంగా కూడా ఈ సినిమాలు డిజాస్టరనే చెప్పాలి.
కానీ వాల్తేరు వీరయ్య సినిమాతో దేవీ ఫామ్ లోకి వచ్చాడనే అనుకోవాలి. ఆ సినిమా సక్సెస్ లో దేవీ సంగీతం కీలకపాత్ర పోషించింది. ఆ సినిమా తర్వాత గ్యాప్ తీసుకున్న దేవీ, ఇప్పుడు స్ట్రాంగ్ కంబ్యాక్ ఇవ్వాలని చూస్తున్నాడు. ప్రస్తుతం దేవీ చేతిలో మంచి క్రేజీ ప్రాజెక్టులే ఉన్నాయి. పుష్ప2 పై అంచనాలు ఓ రేంజ్ లో ఉన్న సంగతి తెలిసిందే.
ఇక ఉస్తాద్ భగత్ సింగ్ తిరిగి ఎప్పుడు మొదలైనా సరే పవర్ స్టార్ ఫ్యాన్స్ కు దేవీ పూనకాలు తెప్పించనున్నాడని హరీష్ శంకర్ చెప్తూనే ఉన్నాడు. తండేల్ కు మొదట్లో అనిరుధ్ ను అనుకుని దేవీనే బెస్ట్ అనుకుని ఫైనల్ చేశారు. తాజాగా ధనుష్- శేఖర్ కమ్ముల సినిమా కూడా దేవీ అకౌంట్లోకి వచ్చింది. మ్యూజిక్ డైరెక్టర్ల కొరత బాగా ఉన్న టైమ్ లో దేవీ తన చేతిలోని అవకాశాలను సరిగ్గా వాడుకుంటే తిరిగి ఇంతకు ముందున్న ఫామ్ ను ఈజీగా తెచ్చుకోవచ్చు. దేవీ కూడా ఈ మేరకు చాలా గట్టిగానే ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది.













