Pushpa3: పుష్ప3పై దేవీశ్రీ కామెంట్స్
పుష్ప2(Pushpa2) ఇంకా థియేటర్లలో దూసుకెళ్తుండగానే దానికి సీక్వెల్ అయిన పుష్ప3(Pushpa3) పైన నెట్టింట రకరకాల ప్రచారాలు జరుగుతున్నాయి. పుష్ప2 క్లైమాక్స్ లో పుష్ప3 ఉంటుందని హింట్ అయితే ఇచ్చారు కానీ నిజంగా అది ఉంటుందో లేదో అప్పుడే చెప్పలేం. కానీ అప్పుడే పుష్ప3లో ఐటెమ్ సాంగ్ గురించి ఆ చిత్ర మ్యూజిక్ డైరెక్టర్ దేవీ శ్రీ ప్రసాద్(Devi Sri Prasad) మాట్లాడుతున్నాడు.
పుష్ప3 సినిమా తీస్తే అందులో ఐటెమ్ సాంగ్ కోసం జాన్వీ కపూర్(Janhvi Kapoor) ను సెలెక్ట్ చేసుకుంటే బావుంటుందని దేవీ శ్రీ అభిప్రాయపడ్డాడు. నార్మల్ గా తన లిమిట్స్ లో లేని విషయాల్లో దేవీ శ్రీ జోక్యం చేసుకోడు. కానీ పుష్ప3 ఐటెమ్ సాంగ్ విషయంలో మాత్రం తన అభిప్రాయాన్ని వెల్లడించాడు. పుష్ప2 లో ఐటెమ్ సాంగ్ కోసం శ్రీలీల(Sree Leela)ను తీసుకోమని చెప్పింది కూడా తానే అని ఈ సందర్భంగా దేవీ చెప్పుకొచ్చాడు.
పుష్ప3లో ఐటెం సాంగ్ ఎవరు చేయాలనే విషయాన్ని దర్శక నిర్మాతలు డిసైడ్ చేస్తారు. పాటనే బట్టే హీరోయిన్ ను ఎంపిక చేసుకుంటారు. కానీ నా ఉద్దేశంలో మాత్రం జాన్వీ అయితే బావుంటుందనుకుంటున్నానని, జాన్వీ అద్భుతమైన డ్యాన్సర్ అని, శ్రీదేవి గారిలో ఉన్న గ్రేస్ తనలో ఉందని దేవీ చెప్పుకొచ్చాడు.













