దేవినేని తొలి షెడ్యూల్ పూర్తి
రాజకీయ నాయకుడు దేవినేని నెహ్రూ జీవితం ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రం దేవినేని. జెజవాడ సింహం అనేది ఉపశీర్షిక. నందమూరి తారకరత్న ప్రధాన పాత్రధారి. నర్రా శివ నాగేశ్వరరావు దర్శకుడు. రాము రాథోడ్ నిర్మిస్తున్నారు. తొలి షెడ్యూల్ చిత్రీకరణ పూర్తయింది. దర్శకుడు మాట్లాడుతూ బెజవాడ నగరంలోని ఇద్దరు నాయకుల మధ్య స్నేహం, వైరం నేపథ్యంలో సాగే చిత్రమిది. కుటుంబ నేపథ్యాన్ని మేళవించాం. దేవినేని నెహ్రూ పాత్రలో తారకరత్న పరకాయ ప్రవేశం చేశారు. వంగవీటి రాధ పాత్రలో బెనర్జీ, చలసాని వెంకటరత్నం పాత్రలో తుమ్మల ప్రసన్నకుమార్ నటన ఆకట్టుకుంటుంది. వంగవీటి రంగా పాత్రలో ఒక ప్రముఖ నటుడు కనిపిస్తారన్నారు. 1977 వాతావరణాన్ని ప్రతిబింబించేలా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నాం అన్నారు నిర్మాత. నాగినీడు, పృథ్వీ, అజయ్, ఎమ్.ఎన్.ఆర్.చౌదరి తదితరులు నటిస్తున్నారు.













