డెవిల్ కోసం బెస్ట్ డేట్ చూస్తున్న మేకర్స్
అమిగోస్ తర్వాత నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా వస్తోన్న సినిమా డెవిల్. అనుకున్నది అనుకున్నట్లు జరిగితే ఈ సినిమా గత నెల 24న రిలీజ్ కావాల్సింది. కానీ కొన్ని టెక్నికల్ ఇష్యూస్ వల్ల సినిమా పోస్ట్ పోన్ అయిన సంగతి తెలిసిందే. దానికి తోడు డైరెక్టర్ నవీన్ మేడారంను సినిమా నుంచి తప్పించడం, చివరకు నిర్మాతే డైరెక్టర్ గా తన పేరు వేసుకోవడం వల్ల ఈ సినిమా జనాల్లోకి బాగానే వెళ్లింది.
అయితే ఇప్పుడు ఈ సినిమా రిలీజ్ డేట్ విషయంలో మేకర్స్ ఓ క్లారిటీకి వస్తున్నారని తెలుస్తోంది. డిసెంబర్ 29న డెవిల్ ను థియేటర్లలోకి దింపాలని ట్రై చేస్తున్నారట. సలార్, డంకీ సినిమాలు రిలీజైన తర్వాతి వారమే తమ సినిమాలను రిలీజ్ చేయడం ఎందుకులే అని చాలామంది ఈ డేట్ను లైట్ తీసుకున్నారు.
సుమ కొడుకు రోషన్ ఒక్కడే ఈ డేట్లో తన సినిమాను రిలీజ్ చేస్తున్నాడు. కొత్త హీరో కాబట్టి ఇది కాకుండా మరో సినిమాను రిలీజ్ చేసే స్కోప్ చాలా ఉంది. అందుకే సరిగ్గా ఆ డేట్ పై ఫోకస్ చేసింది డెవిల్. మంచి టాక్ వస్తే జనవరి 11 వరకు మంచి కలెక్షన్స్ రాబట్టుకునే ఛాన్స్ ఉండనే ఉంది. ఏదేమైనా సరే ఈ రెండు మూడు రోజుల్లో డెవిల్ రిలీజ్ డేట్ విషయంలో డెసిషన్ తీసుకోవాలి. అప్పుడే ప్రమోషన్స్ సరిగా ప్లాన్ చేసి, సినిమాను జనాల్లోకి తీసుకెళ్లే ఛాన్సుంటుంది. మరి డెవిల్ మేకర్స్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి.













