వైరల్ అవుతున్న డెవిల్ డైరెక్టర్ ఇన్‌స్టా పోస్ట్..
కళ్యాణ్ రామ్ హీరోగా సంయుక్త మేనన్ హీరోయిన్గా నటిస్తున్న పాన్ ఇండియా సినిమా డెవిల్. ఈ సినిమాలో కళ్యాణ్ రామ్ బ్రిటిష్ సీక్రెట్ ఏజెంట్‌గా కనిపిస్తున్నాడు. నవంబర్ 24న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా డైరెక్టర్ ఎవరనేది గత కొన్నాళ్లుగా ప్రేక్షకులకు అంతుపట్టడం లేదు. మొదట్లో ఈ సినిమాను అనౌన్స్ చేసినప్పుడు డైరెక్టర్ గా నవీన్ మేడారం పేరును అనౌన్స్ చేశారు.
కానీ ఇప్పుడు ఈ సినిమా ప్రమోషనల్ కంటెంట్‌ను రిలీజ్ చేస్తూ అనౌన్స్ చేసిన పోస్టర్ లో మాత్రం డైరెక్టర్ గా నవీన్ పేరుకు బదులు నిర్మాత అయిన అభిషేక్ నామా పేరుంది. దీంతో మరోసారి డెవిల్ సినిమా గురించి అందరూ మాట్లాడుకుంటున్నారు. డైరెక్టర్ కు నిర్మాతకు మధ్య విభేదాలేమైనా వచ్చాయా అని అంతా అనుకుంటున్నారు.
సరిగ్గా ఇదే టైమ్‌లో నవీన్ తన ఇన్‌స్టాలో ఓ పోస్ట్‌ని పెట్టి వినాశకాలే విపరీత బుద్ధి అని సంస్కృతంలో క్యాప్షన్ రాసుకొచ్చారు. మరి నవీన్ ఈ పోస్ట్‌ను చేసింది డెవిల్ టీమ్‌ను ఉద్దేశించా లేక నార్మల్‌గానే చేశాడా అనేది తెలియదు కానీ చూస్తుంటే మాత్రం ఇది వారిని ఉద్దేశించి చేసినట్లే అనిపిస్తుంది. మరి ఇదంతా నిజమా లేక ప్రమోషన్స్ కోసం ఇలా ఏమైనా స్టంట్స్ చేస్తున్నారా అనేది తెలియాల్సి ఉంది.













