ఇప్పటి వరకు పుష్ప టీమ్‌ను కలవలేదు : దేవీశ్రీ
ఈ ఏడాది నేషనల్ అవార్డులతో టాలీవుడ్ పండగ చేసుకుంది. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 11 అవార్డులను టాలీవుడ్ గెలుచుకుని మంచి ఆధిపత్యాన్ని చాటింది. ఎప్పటికంటే అవార్డులు ఎక్కువగా వచ్చినప్పటికీ టాలీవుడ్ ఈ విజయాన్ని గ్రాండ్ స్కేల్ లో మాత్రం సెలబ్రేట్ చేయకుండా ఉండటం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. పుష్ప సినిమాకు బెస్ట్ యాక్టర్ గా సెలెక్టైన అల్లు అర్జున్ మాత్రం పార్టీలు, ఫంక్షన్లు, పెద్దవాళ్లను కలవడం అంటూ నానా హంగామానే చేశాడు. మీడియా సైతం అల్లు అర్జున్‌ని ఈ విషయంలో బాగా ఫోకస్ చేసింది. బన్నీ తప్ప ఇంకెవరూ నేషనల్ అవార్డుల విజయాన్ని సెలబ్రేట్ చేయలేదనే చెప్పాలి. ఆరు అవార్డులు గెలుచుకున్న ఆర్ఆర్ఆర్ టీమ్ నుంచి అయితే ఎలాంటి సెలబ్రేషన్స్ లేవు.
పుష్ప మూవీకి బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్‌గా సెలెక్ట్ అయిన దేవీ శ్రీ ప్రసాద్ మాత్రం అసలెక్కడా కనిపించలేదు. కనీసం దేవీ, పుష్ప టీమ్ ను కూడా ఇప్పటి వరకు కలిసి సెలబ్రేట్ చేసుకుంది లేదు. నేషనల్ అవార్డ్స్ అనౌన్స్ అయి రెండు వారాలు దాటినప్పటికీ, ఇప్పటికీ తాను హైదరాబాద్‌కు రాలేదని, పుష్ప టీమ్ ను కూడా కలవలేదని దేవీ తెలిపాడు.
తీరిక లేకపోవడంతో హైదరాబాద్‌కు రాలేదని, నేషనల్ అవార్డ్ వచ్చిన దానికంటే పుష్ప పాటలు అందరికీ నచ్చడం తనకి ఇంకా పెద్ద అవార్డు అని, ఇప్పుడు తనపై మరింత బాధ్యత పెరిగిందని, పుష్ప పాటలను మించేలా పుష్ప2 పాటలను ఇవ్వడానికి ట్రై చేస్తున్నానని దేవీ రీసెంట్గా ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు.













