ఎన్టీఆర్ కోరిక మేరకు మళ్ళీ అదే కాంబినేషన్!
యంగ్ టైగర్ ఎన్టీఆర్ తన 30వ సినిమాను హిట్ చిత్రాల దర్శకుడు కొరటాల శివ దర్శకత్వంలో చేయబోతున్నట్టు ఉగాది కానుకగా ప్రకటించాడు. జనతా గ్యారేజ్ సినిమాతో ఐదేళ్ళ కింద సంచలన విజయం సాధించిన వీరిద్దరి కాంబినేషన్.. ఇప్పుడు మరోసారి బాక్సాఫీస్ రికార్డ్స్ రిపేర్లు చేయడానికి వస్తున్నారు. అప్పుడు రిపేర్లు అన్నీ లోకల్లోనే జరిగాయి కానీ ఈసారి దాని సరిహద్దులు చెరిపేస్తాం అని అన్నారు కొరటాల శివ. ఈ సినిమా కూడా ప్యాన్ ఇండియా అని కన్ఫామ్ చేసాడు కొరటాల శివ. మరోసారి జూనియర్ ఎన్టీఆర్తో సినిమా చేయబోతుండటం హ్యాపీగా ఉందన్నాడు కొరటాల. నందమూరి తారకరామారావు ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ ఈ సినిమాను సంయుక్తంగా నిర్మించబోతున్నాయి. మిక్కిలినేని సుధాకర్ ఈ చిత్రంతో నిర్మాతగా మారుతున్నాడు.
ఎన్టీఆర్ ప్రస్తుతం దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో ఆర్ఆర్ఆర్ మూవీ షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. మరోవైపు దర్శకుడు కొరటాల శివ మెగాస్టార్ చిరంజీవితో ఆచార్య సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. ఆచార్య చిత్రం మే 13 న విడుదల కావాల్సి ఉండగా కరోనా సెకండ్ వేవ్ వల్ల అనుకున్న సమయానికి విడుదలయ్యే ఛాన్స్ లేదనే చెప్పాలి. ఆచార్య చిత్రానికి మెలోడీ బ్రహ్మ మణిశర్మ సమకూర్చిన బాణీలకు, నేపధ్య సంగీతానికి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ సమయంలోనే కొరటాల తన తరువాతి చిత్రానికి కూడా మణిశర్మతో పనిచేయాలని నిర్ణయం తీసుకున్నాడట.
కొరటాల శివ- ఎన్టీఆర్ కంబినేషన్లో వచ్చిన జనతా గారేజ్ చిత్రానికి దేవి శ్రీ ప్రసాద్ తన సంగీతంతో ప్రాణం పోశాడు. ఇప్పుడు కూడా అదే కాంబినేషన్ లో చేస్తే సెంటిమెంట్ పరంగా కూడా కలిసొస్తుంది అని ఎన్టీఆర్ ఆలోచిస్తున్నాడట. దర్శకుడు కొరటాల కూడా ఈ సూచనను అంగీకరించే అవకాశం ఉంది. ఈ చిత్రం సంగీత దర్శకుడి విషయంలో కొరటాల శివ కుడా దేవిశ్రీ ప్రసాద్ వైపే మొగ్గు చూపే అవకాశం ఉందని, ఎన్టీఆర్ ప్రత్యేకించి చెప్పాక డైరక్టర్ కాదనేదేముంటుంది అందరూ అనుకుంటున్నారు. అందరిని ఆశ్చర్య పరిచేలా అనౌన్స్ చేసిన రోజునే ఎప్రిల్ 29, 2022న ఈ చిత్రం విడుదల కానుందని ప్రకటించారు దర్శక నిర్మాతలు. జులై తర్వాత షూటింగ్ మొదలు పెట్టి నాన్ స్టాప్ షూటింగ్ చేయాలని భావిస్తున్నాడు దర్శకుడు కొరటాల శివ.













