పెళ్లి పీటలెక్కబోతున్న దేవీ శ్రీ ప్రసాద్?
టాలీవుడ్ లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్స్ లిస్ట్ లో హీరోల్లో ప్రభాస్ పేరు ఫస్ట్ ఉంటే, మ్యూజిక్ డైరెక్టర్లలో దేవీ శ్రీ ప్రసాద్ పేరు ఎప్పటినుంచో ఫస్ట్ లిస్ట్ లో ఉంది. ఈ లిస్ట్ లో నుంచి దేవీ పేరు తొలగిపోవట్లేదు. ఫిల్మ్ నగర్ లో వినిపిస్తున్న టాక్ ప్రకారం దేవీశ్రీ త్వరలోనే పెళ్లి పీటలెక్కబోతున్నాడట. తనకు దగ్గరి బంధువుల్లోని అమ్మాయినే దేవీ వివాహమాడుతున్నట్లు తెలుస్తోంది.
ఇప్పటికే దీనికి సంబంధించి రెండు కుటుంబాల మధ్య చర్చలు జరిగాయని, దేవీకి వరసకు మరదలయ్యే అమ్మాయితో పెళ్లి ఫిక్స్ అయినట్లు సమాచారం. వికీపీడియా ప్రకారం, దేవీ వయసు 43 సంవత్సరాలు. దేవీ పెళ్లి చేసుకోబోయే అమ్మాయి వయసు తన కంటే 17 సంవతరాలు చిన్నది అని టాక్ నడుస్తోంది.
వాస్తవానికి దేవీకి మ్యారెజ్ ట్రయల్స్ ఎప్పటి నుంచో జరుగుతున్నా, అవి కొలిక్కి రాలేదు. 1997లో దేవి సినిఆమతో ఇండస్ట్రీకి వచ్చిన డీఎస్పీ తన మొదటి ప్రయత్నంతోనే మంచి హిట్ అందుకుని, తర్వాత చిరంజీవి, బాలకృష్ణ లాంటి నిన్న తరం హీరోలతోనూ, ఈ తరం హీరోలైన మహేష్, పవన్‌తోనూ ఎన్నో అద్భుతమైన ఆల్బమ్స్ ఇచ్చాడు. కానీ గత కొంతకాలంగా మాత్రం దేవీ రేంజ్ తగ్గిందనే చెప్పాలి. ప్రస్తుతం ఆడియన్స్ ఆశలన్నీ దేవీ మ్యూజిక్ ఇస్తున్న పుష్ప ది రూల్ మీదే ఉన్నాయి.
ఏదేనా సరే మొత్తానికి దేవీ పెళ్లి న్యూస్ ఇప్పుడు టాలీవుడ్లో వైరల్ అవుతోంది. ఇప్పటివరకు ఈ విషయంలో ఎలాంటి అఫీషియల్ అనౌన్స్మెంట్ లేకపోయినప్పటికీ, నిప్పు లేనిదే పొగరాదు కదా అని అందరూ అంటున్నారు. ఈ విషయంలో దేవీ స్పందిస్తే తప్ప క్లారిటీ వచ్చేలా లేదు.













