క్రేజీ ప్రాజెక్టులతో దేవీ శ్రీ బిజీ
గత కొంత కాలంగా టాలీవుడ్ లో దేవీ శ్రీ ప్రసాద్ నుంచి సరైన ఆల్బమ్స్ రావడం లేదు. ఆయన నుంచి చివరిగా వచ్చిన చెప్పుకోదగ్గ ఆల్బమ్స్ ఏమైనా ఉన్నాయా అంటే రంగస్థలం, ఉప్పెన, పుష్ప1 మాత్రమే. మిగిలిన వాటిలో రీరికార్డింగ్ బాగుంటే పాటలు సరిగా లేవు. పాటలు బావుంటే రీరికార్డింగ్ బాలేదు. దీంతో దేవీకి ఛాన్సులు తగ్గాయని తమన్ హవా నడుస్తుందని అనుకున్నారు.
కానీ దేవీ శ్రీ చేతిలో ప్రస్తుతం అర డజనుకు పైగా క్రేజీ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. వాటిలో ముందుగా చెప్పుకోవాల్సింది పుష్ప2 గురించి. ఈ సినిమాకు దేవీ ఇప్పటికే అదిరిపోయే ట్యూన్స్ ఇచ్చాడని ఇప్పటికే టాక్ ఉంది. సూర్య- శివ కాంబోలో వస్తున్న కంగువా సినిమాకు కూడా దేవీనే సంగీతం అందిస్తున్నాడు. ఈ సినిమా ఏకంగా పదికి పైగా భాషల్లో రిలీజ్ కానుంది.
నాగచైతన్య, చందూ మొండేటి కాంబోలో తెరకెక్కుతున్న తండేల్ కు కావాలని మరీ డైరెక్టర్ దేవీని సెలెక్ట్ చేసుకున్నాడు. నాగార్జున-శేఖర్ కమ్ముల- ధనుష్ కాంబోలో వస్తున్న సినిమాకు దేవీ శ్రీ నే మ్యూజిక్ డైరెక్టర్. వీటితో పాటూ పవన్ కళ్యాణ్-హరీష్ శంకర్ కాంబోలో తెరకెక్కుతున్న ఉస్తాద్ భగత్ సింగ్ కూడా దేవీ చేతిలోనే ఉంది. విశాల్ హీరోగా వస్తున్న రత్తం సినిమాకు ఇప్పటికే దేవీ వర్క్ స్టార్ట్ చేశాడు. ఇవన్నీ క్రేజీ సినిమాలే. వీటిలో కనీసం మూడు సినిమాలకు దేవీ మంచి ఆల్బమ్స్, బీజీఎం ఇచ్చినా తన డిమాండ్ మరింత పెరిగే ఛాన్సుంది.













