ఈసారైనా దేవీ బౌన్స్ బ్యాక్ అవుతాడా?
ఒకప్పుడు టాలీవుడ్ లో టాప్ మ్యూజిక్ డైరెక్టర్ గా నెం.1 స్థానంలో ఓ వెలుగు వెలిగాడు దేవీ శ్రీ ప్రసాద్. మణిశర్మ తర్వాత అతని రేంజ్ ఉన్న మ్యూజిక్ డైరెక్టర్ గా దేవీ నిలదొక్కుకున్నాడు. థమన్ నుంచి పోటీ ఉన్నప్పటికీ దేవీ రేంజ్ వేరనేలానే అతని వర్క్ ఉండేది. దాదాపు పదేళ్ల పాటూ తెలుగు సినిమా మ్యూజిక్ ను ఏలేసిన దేవీ నుంచి గత కొన్నేళ్లుగా తన టాలెంట్‌కు తగ్గ మ్యూజిక్ రావట్లేదనే కంప్లైంట్ అయితే ఉంది.
ఇలాంటి కంప్లైంట్ ఉన్నప్పుడు కూడా దేవీ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ల లిస్ట్ లోనే ఉన్నాడు కానీ తన సంగీతంలో మునుపటి ఫీల్ ను ఆడియన్స్ ఎంజాయ్ చేయలేకపోతున్నారు. అతని మ్యూజిక్ లో సోల్ మిస్ అయింది. రీరికార్డింగ్ తో కూడా దేవీ మెప్పించలేకపోయాడు. సరిగ్గా ఇదే టైమ్ లో థమన్ ఎదిగిపోయాడు.
తను చేసిన అలవైకుంఠపురములో, అఖండ సినిమాలు తనను మరింత ఎత్తుకు తీసుకెళ్లాయి. దానికి తోడు వేరే భాష నుంచి వచ్చిన మ్యూజిక్ డైరెక్టర్లు కూడా ఇక్కడ టాలీవుడ్లో సత్తా చాటుతున్నారు. దీంతో దేవీ పాత పాటలను నెట్టింట షేర్ చేస్తూ మునుపటి దేవీని, అతని మ్యూజిక్ ని మిస్ అవుతున్నామని ఆయన ఫ్యాన్స్ పోస్టు లు చేస్తున్నారు.
ఇలాంటి టైమ్‌లో దేవీ నుంచి చాలా ఏళ్ల తర్వాత ఓ మంచి మ్యూజిక్ వచ్చింది. రీసెంట్గా సూర్య బర్త్ డే సందర్భంగా రిలీజైన కంగువా గ్లింప్స్ కు దేవీ శ్రీ ఇచ్చిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కు అందరూ ఆశ్చర్యపోయారు. ఈ గ్లింప్స్ ను నెక్ట్స్ లెవెల్ కు తీసుకెళ్లింది డీఎస్పీ రీరికార్డింగ్. ఈ గ్లింప్స్ చూశాక దేవీ ఫ్యాన్స్ మునుపటి బాకీలన్నింటినీ ఈ సినిమాతో తీర్చేస్తామని నెట్టింట తెగ సంబరపడిపోతున్నారు. చూడాలి మరి దేవీ కంగువాతో అయినా బౌన్స్ బ్యాక్ అవుతాడేమో!













