వాళ్లిదరి పైనే నడుస్తున్న టాలీవుడ్
టాలీవుడ్ లో పెద్ద సినిమా వస్తుందంటే చాలు మ్యూజిక్ డైరెక్టర్ గా తమన్, దేవీ శ్రీ పేర్లలో ఒకటి ఉంటుంది. ఒకప్పుడు టాలీవుడ్ లో దేవీ నెంబర్ వన్ పొజిషన్ లో ఉంటే, గత కొన్నేళ్లుగా తమన్ ఆ స్థానంలో తిష్ట వేసుకున్నాడు. స్టార్ డైరెక్టర్ల సినిమాలకు తమన్ ఫస్ట్ ఆప్షన్ అయ్యాడు. అలా అని దేవీకి ఉన్న డిమాండ్ ఏమీ తగ్గలేదు.
కానీ వీరిద్దరినీ దాటి మాత్రం మరోకరి పేరు వినిపించడం లేదు. రీసెంట్గా అనిరుధ్ సత్తా చూసి మరీ పెద్ద సినిమా అయితే రెమ్యూనరేషన్ గురించి పట్టించుకోకుండా అనిరుధ్ ని తెస్తున్నారు. అంతే తప్పించి, టాలీవుడ్ లో ఉన్న టాలెంటెడ్ మ్యూజిక్ డైరెక్టర్లకు ఛాన్స్ ఇవ్వడం లేదు. రాజమౌళి తన సినిమాలకు కీరవాణిని తప్ప మరొకరిని తీసుకోడు. సుకుమార్ దేవీకి తప్ప వేరే వాళ్లకు ఛాన్స్ ఇవ్వడు.
టాలీవుడ్ లో అనూప్, మిక్కీ జే మేయర్ లాంటి టాలెంట్ ఉన్న సంగీత దర్శకులెంతమందో ఉన్నారు కానీ వాళ్లు మాస్ సినిమాలకు సరిపోయే మ్యూజిక్ ఇవ్వలేరని పక్కన పెట్టేశారు. ఈ నేపథ్యంలో టాలీవుడ్ లో ఒక సంగీత దర్శకుడు ఆశాజనకంగా కనిపిస్తున్నాడు. అతనే బీమ్స్ సిసిరోలియో. ధమాకా, బలగం, మ్యాడ్ లాంటి సినిమాలతో భీమ్స్ తన టాలెంట్ ను చూపించాడు.
ఈ మూడు సినిమాల సక్సెస్‌లో మ్యూజిక్ కీ రోల్ ప్లే చేసింది. అన్ని రకాల సాంగ్స్ కు భీమ్స్ సంగీతం ఇవ్వగలడని ఈ మూడు సినిమాలు ప్రూవ్ చేశాయి. త్వరలో అతను గాంజా శంకర్ అనే మాస్ మూవీకి సంగీతం అందించబోతున్నాడు. ఇప్పటికైనా మన దర్శకనిర్మాతలు రేంజ్ తో సంబంధం లేకుండా టాలెంట్ ఉన్న వారిని ఎంకరేజ్ చేస్తే వారి సత్తా కూడా తెలుస్తోంది.













