పుష్ప2కు దేవీ శ్రీ ఎలివేషన్లు
అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన పుష్ప సినిమా ఏ రేంజ్ సక్సెస్ ను అందుకుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. రీజనల్ ఫిల్మ్ గా స్టార్ట్ అయిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా సంచలనాలు సృష్టించింది. దీంతో ఈ సినిమా సీక్వెల్ అయిన పుష్ప2 పై విపరీతమైన క్రేజ్ పెరిగింది. రిలీజ్ కు చాలానే టైమ్ ఉన్నప్పటికీ పుష్ప2 నుంచి వచ్చే అప్డేట్స్ ఫ్యాన్స్ కు ఓ రేంజ్ లో కిక్ ఇస్తున్నాయి.
రీసెంట్ గా పుష్ప2 గురించి సంగీత దర్శకుడు దేవీ శ్రీ ప్రసాద్ కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలను షేర్ చేశాడు. పుష్ప2 స్టోరీని సుకుమార్ తనకు చెప్పాడని, ప్రతీ సీన్‌ను అంతే ఇంటెన్సిటీతో తెరకెక్కించారని, బన్నీ యాక్టింగ్ ఈ సినిమాలో నెక్ట్స్ లెవెల్లో ఉంటుందని దేవీ చెప్పాడు. అంతేకాదు పుష్ప2 ఇంటర్వెల్ బ్యాంగ్ ఆడియన్స్ కు ఝలక్ ఇస్తుందని కూడా దేవీ తెలిపాడు.
పుష్ప2లో ఓ స్పెషల్ సీన్ ఉందని, అది అందరినీ షాక్ కు గురి చేస్తుందని చెప్పిన దేవీ, ఈ సినిమాలో అల్లు అర్జున్ యాక్టింగ్ అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తుందని చెప్పాడు. రష్మిక మందన్నా హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో మ్యూజిక్ కూడా నెక్ట్స్ లెవెల్ లో ఉండబోతున్నట్లు చెప్పిన దేవీ, ఇప్పటికే పుష్ప2 కోసం ఇచ్చిన కొన్ని ట్యూన్స్ ఇచ్చినట్లు చెప్పుకొచ్చాడు.













