సూసేకి సాంగ్తో మ్యాజిక్ చేసిన దేవీ శ్రీ
చెప్పినట్టే పుష్ప2 నుంచి రెండో లిరికల్ వీడియోను మేకర్స్ ఇవాళ రిలీజ్ చేశారు. పుష్పలో సూపర్ హిట్ అయిన నా సామి సాంగ్ కు ఎక్స్టెన్షన్ లా ఉంటుందని మేకర్స్ ముందు నుంచే ఆడియన్స్ ను ఊరించారు. వారి అంచనాలకు తగ్గట్టే సాంగ్ ఆ పాట కంటే బెటర్ గా, వినే కొద్దీ సూపర్ గా ఉందని మ్యూజిక్ లవర్స్ అభిప్రాయపడుతున్నారు. దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం, చంద్రబోస్ రచన, శ్రేయ ఘోషల్ వాయిస్ అన్నీ ట్యూన్ చాలా బాగా కుదిరాయి. ట్యూన్ వినేకొద్దీ వినసొంపుగా ఉంది. దేవీ ఇన్స్ట్రుమెంటేషన్ ప్రతీసారి కొత్తగా ఉండదు. దానికి మంచి సాహిత్యం ఉండాలి. అలాంటిది సూసేకి సాంగ్ కు కుదిరింది. పాటలో పుష్పరాజ్ వ్యక్తిత్వాన్ని వర్ణిస్తూనే భార్య దగ్గర అతనెలా ఓ మామూలు భర్తలా ఉంటాడో చెప్పే లిరిక్స్ అందరికీ నచ్చింది.
దానికి తోడు శ్రేయ గొంతు సాంగ్ ను నెక్ట్స్ లెవెల్ కు తీసుకెళ్లింది. రీసెంట్ గా వాయిద్యాల సౌండ్ లో లిరిక్స్ వినిపించడం కష్టమైంది. అలాంటి టైమ్ లో ఈ సాంగ్ ఆడియన్స్ కు చాలా ఫ్రెష్ గా అనిపిస్తుంది. లిరికల్ వీడియోలో రిహార్సల్ టైమ్ లో నార్మల్ కాస్ట్యూమ్స్ లో ఉన్నప్పుడు తీసిన ఫుటేజ్ ను వాడటం చాలా తెలివిగా అనిపిస్తుంది. మొత్తానికి సూసేకి సాంగ్ తో దేవీ శ్రీ మరో సారి మ్యాజిక్ చేశాడు. ఈ పాట ఇన్స్టంట్ చార్ట్ బస్టర్ గా అయిపోయింది.













