దేవర కౌంట్‌డౌన్ స్టార్ట్స్
జూ.ఎన్టీఆర్, కొరటాల శివ కాంబినేషన్లో దేవర అనే పాన్ ఇండియా సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. జనతా గ్యారేజ్ తర్వాత వీరిద్దరి కాంబోలో తెరకెక్కుతున్న సినిమా కావడంతో దేవరపై మంచి అంచనాలున్నాయి. ఇదిలా ఉంటే ఈ సినిమాలో ఎన్టీఆర్ క్యారెక్టర్ నెవర్ బిఫోర్ అనేలా ఉంటుందని డైరెక్టర్ ముందు నుంచి చెప్తూనే వస్తున్నాడు.
శరవేగంగా షూటింగ్ పూర్తి చేసుకుంటున్న ఈ సినిమా విషయంలో మేకర్స్ చాలా తెలివిగా వ్యవహరిస్తున్నారు. సినిమాకు సంబంధించిన పోస్టర్లు ఎలాంటి టైమ్ లో రిలీజ్ చేయాలి? ఎలా సినిమాకు హైప్ పెంచాలనేది కూడా మేకర్స్ ఆలోచిస్తున్నారు. దేవర సినిమా వచ్చే ఏడాది ఏప్రిల్ 5న ప్రేక్షకుల ముందుకు రానుంది.
అంటే రిలీజ్ కు ఇంకా సరిగ్గా 150 రోజులుంది. ఈ విషయాన్ని ఆడియన్స్ కు గుర్తు చేస్తూ మేకర్స్ ఓ స్పెషల్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. భయనికి మరొక పేరుగా దేవర పాత్ర హైలైట్ కానుందని ఈ పోస్టర్ ద్వారా క్లారిటీ ఇచ్చారు. దేవరలో బాలీవుడ్ స్టార్ యాక్టర్ సైఫ్ అలీ ఖాన్ విలన్ గా నటిస్తుండగా, హీరోయిన్ గా జాన్వీ కపూర్ నటిస్తోంది. అనిరుధ్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా రెండు భాగాలుగా రిలీజ్ కానున్న విషయం తెలిసిందే.













