దేవర ప్లేస్ లోకి రావాలని చూస్తున్న యంగ్ హీరోలు
టాలీవుడ్ నుంచి ఈ ఇయర్ రాబోతున్న భారీ సినిమాల్లో ఎన్టీఆర్ నటిస్తున్న దేవర ఒకటి. ఆర్ఆర్ఆర్ తర్వాత ఎన్టీఆర్ నటిస్తున్న చిత్రం కావడం, దానికి దర్శకుడు కొరటాల శివ అవడంతో ఈ సినిమాపై అంచనాలు భారీ స్థాయిలో ఉన్నాయి. చిత్ర యూనిట్ చెప్పిన ప్రకారం దేవర ఏప్రిల్ 5న ప్రేక్షకుల ముందుకు రావాలి.
కానీ ఇప్పుడు ఈ సినిమాకు అనుకోని చిక్కు ఎదురైంది. దేవరలో విలన్ క్యారెక్టర్ చేస్తున్న సైఫ్ అలీ ఖాన్ షూటింగ్ సెట్ లో గాయపడి సర్జరీ చేయించుకున్న విషయం తెలిసిందే. సైఫ్ సర్జరీ నుంచి కోలుకోవడానికి కాస్త టైమ్ పట్టనుందని తెలుస్తోంది. దేవరలో సైఫ్ క్యారెక్టర్ కు సంబంధించిన కొన్ని కీలక సన్నివేశాలు ఇంకా పెండింగ్ ఉన్నాయి.
సైఫ్ రికవరీ అయి, షూట్ లో జాయిన్ అవాలంటే షూటింగ్ లేటవుతుంది. ఈ కారణం వల్లే దేవర ఏప్రిల్ 5 నుంచి తప్పుకునే అవకాశాలు ఎక్కువ ఉన్నట్లు తెలుస్తోంది.ఒకవేళ దేవర పోస్ట్ పోన్ అయితే మిగిలిన సమ్మర్ సినిమాల రిలీజ్ డేట్ల విషయంలో చాలా మార్పులు జరుగుతాయి. డబుల్ ఇస్మార్ట్, టిల్లు స్క్వేర్, ఫ్యామిలీ స్టార్ లాంటి సినిమాలు దేవర ప్లేస్ లోకి రావడానికి ట్రై చేస్తాయి. దేవర రిలీజ్ పోస్ట్ పోన్ అయిందన్న వార్త మేకర్స్ నుంచి రాగానే, మిగిలిన సినిమాల నిర్మాతలు తమ రిలీజ్ డేట్లను అనౌన్స్ చేయడానికి రెడీగా ఉన్నారు.













